Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మెడికల్ విద్యను అందించడంలో కేసీఆర్ విప్లవాత్మక చర్యలు …మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభo

హాజరైన మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్

బైక్ ర్యాలీ తో ఘన స్వాగతం

పువ్వాడ నాగేశ్వర రావు జన్మదిన వేడుకలకు హాజరు

నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన

రైతులను అడ్డుకున్న బి.ఆర్.ఎస్.నేత

కంటి వెలుగు వాహనదారుల అరెస్ట్

మెడికల్ విద్యను అందించడంలో కేసీఆర్ విప్లవాత్మక చర్యలు …మంత్రి హరీష్ రావు

మెడికల్ విద్యను అందించడంలో సీఎం కేసీఆర్ దేశంలోనే మొదటిసారిగా అన్ని జిల్లాల్లో కళాశాలలను ఏర్పాటు చేయడం ఒక విప్లవాత్మక చర్యగా రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్ధిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు …గురువారం ఖమ్మం వచ్చిన మంత్రి సుడిగాలి పర్యటన చేశారు . మమతా మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్నారు . అంతకు ముందు ఖమ్మం లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించారు . జిల్లామంత్రి పువ్వాడ అజయ్ , జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . మమతా కళాశాల ఆవరణలో జరిగిన సభలో పువ్వాడ నాగేశ్వరరావు 85 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వించారు . ఈసందర్బాగం కళాశాల ఏర్పాటు లో పడ్డ కష్టాలను పువ్వాడ నాగేశ్వరరావు , మంత్రి అజయ్ లో వివరించారు …

సభలో పాల్గొన్న ఎంపీలు , ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు , పువ్వాడ నాగేశ్వరరావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు …

నగరంలోని పాత కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు గురువారం లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.


100 సీట్లతో ఈ సంవత్సరం నుండే కళాశాల ప్రారంభం కానున్నట్లు, నేటి నుండి తరగతులు ప్రారంభం కానున్నట్లు వారు తెలిపారు. రూ. 8.5 కోట్లతో పాత కలెక్టరేట్, పౌరసరఫరాలు, గిరిజనాభివృద్ది అధికారి, రోడ్లు భవనాల శాఖల కార్యాలయాలను వైద్య కళాశాల, హాస్టళ్లకు అనుగుణంగా రెనోవేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య కళాశాలలో సమకూర్చిన ల్యాబ్ లు, విద్యార్థులకు హాస్టల్, మౌళిక సదుపాయాల కల్పనలు మంత్రులు పరిశీలించారు. జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రాంత పిల్లలకు వైద్య సీట్లు ఎక్కువగా పొంది, మన ప్రాంతం నుండి వైద్యులు ఎక్కువగా తయారవ్వాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో తీసుకున్న నిర్ణయమని వారు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం సమకూర్చాలని మంత్రి అజయ్ కోరగా, త్వరలో అందజేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. మంత్రి హరీష్ రావు అనంతరం మాజీ ఎమ్మెల్యే, మమత వైద్య విద్యా సంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు 85వ జన్మదిన వేడుకలు, మమత వైద్య విద్యా సంస్థల రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీడియా సమావేశం అనంతరం మంత్రి హరీష్ రావు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు మంత్రి అజయ్ కుమార్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ 5 ఎకరాల్లో రూ. 25 కోట్లతో నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు, ఒక్క సంవత్సరం లోనే పూర్తిచేసి అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సులు అంటే ఆసుపత్రుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రం నుండే ఉండేవారని, రాష్ట్రంలో కావాల్సిన మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది వుండే వారు కారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది గ్రహించి, ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. త్వరలో జిల్లాలో బిఎస్సి పారా మెడికల్ కళాశాల మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, లోకసభ సభ్యులు నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి తదితరులు పాల్గొన్నారు.

కంటి వెలుగు వాహనదారుల నిరసన: జిల్లా ఆసుపత్రి వద్ద మంత్రులు పర్యటనను అడ్డుకునేందుకు కంటి వెలుగు వాహన దారులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫ్లకార్డులతో వాహనదారులు నిరసన వ్యక్తం చేశారు. కంటి వెలుగు కార్యక్రమానికి వాహనాలు పెట్టగా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని వాహనాలు తెలిపారు.

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకి వినతి పత్రం ఇవ్వకుండా
స్థానిక రైతులను బిఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు వేణు అడ్డుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే మద్దులపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 171 లో 22 మంది నిరుపేద దళిత కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించింది.అప్పటి నుండి ఆ భూమి వారి స్వాధీనంలో ఉన్నది. ఆ భూమికి సంబంధించి
అసైన్డ్ పట్టాలు కూడా ఉన్నాయి. దళితుల అసైన్డ్ పట్టా భూముల్లో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించి అధికారులు భూ సేకరణ చేయడంతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నష్టపోతున్న భూముల స్థానంలో సమానమైన భూమిని అదే గ్రామంలో మరొక చోట కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రైతుల తరుపున మంత్రి హరీష్ రావుకి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయగా రూరల్ ఏసిపి బస్వారెడ్డి, సీఐ రాజారెడ్డి అనుమతి ఇవ్వగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణు మంత్రిని కలవకుండా , కనీసం వినతి పత్రం కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. గ్రామానికి నర్సింగ్ కళాశాల రావడాన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తుంది. కానీ కళాశాల నిర్మాణానికి భూములు కోల్పోతున్న దళిత రైతులకు నష్టపోతున్న భూమి స్థానంలో భూమిని ఇవ్వమని మంత్రిని అడగటానికి కూడా కనీసం అవకాశం లేకుండా చేశారని రైతులు,నాయకులు వాపోతున్నారు.
పోలీస్ వారు అనుమతి ఇచ్చినా రైతులను అడ్డుకోవడానికి వేణు ఎవరు అని ప్రశ్నించారు. చివరికి విషయం
పాలేరు ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డికి తెలపడంతో సమస్యలపై శుక్రవారం మాట్లాడుతా అని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

సుడిగాలి పర్యటన: మంత్రి హరీష్ రావు ఖమ్మంలో ఒక రోజు సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఆయనతో పాటు మంత్రి అజయ్, ఎంపీలు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో చేరుకున్నారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

Related posts

ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టాం: మల్లు భట్టి విక్రమార్క

Ram Narayana

రైతుబంధుపై శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

ప్యాకేజీలపై రేణుకాచౌదరి సెటైర్లు …ఎవరు ఇస్తున్నారంటూ ఎదురు ప్రశ్న…

Drukpadam

Leave a Comment