Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిజంగా విష్ణు….. ఎస్ వారియరే…

నిజంగా విష్ణు….. ఎస్ వారియరే…
-నిద్రమత్తు వదిలిస్తున్న వైనం
-తాను పరుగులు పెడుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న అధికారి
-ఆఫీసులో ఉండేది కొంత సమయమే -మిగతా అంత ఫీల్డ్ మీదనే
-నిరంతరం పర్వేక్షణ …నిఘా ముమ్మరం
-లాక్ డౌన్ అమల్లో రాష్ట్రానికే ఆదర్శం
-దటీస్ ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్
ఖమ్మం జిల్లాకు కొత్తగా కమిషనర్ ఆఫ్ పోలీసుగా వచ్చిన విష్ణు ఎస్ వారియర్ నిజంగా వారియర్ లాగానే ఉన్నారు . సహజంగా జిల్లా అధికారులు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎక్కువగా బయట తిరిగారు .కానీ ఆయన ఖమ్మం లో జాయిన్ అయినా దగ్గరనుంచి నిరంతరం లా అండ్ ఆర్డర్ ను స్వయంగా పర్వవేక్షణ చేస్తున్నారు.దీనితో సిబ్బందిలో చురుకు దనం పెరిగింది. ఆమ్మో కమిషనర్ ఎప్పుడు వస్తాడో ఏమో అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన గుణగణాలు తెలియకపోయినా, నిబద్ధతగల అధికారి అనడంలో ఎలాంటి సందేహంలేదు .ఆయన వచ్చిన కొద్దికాలానికే పోలీస్ శాఖలో కదలిక తెచ్చారు. ఇప్పటివరకు నిద్రపోతున్న ఖమ్మం జిల్లా పోలీస్ శాఖను అప్రమత్తం చేశారు. అంతకు ముందు ఉద్యోగానికి వస్తున్నాం పోతున్నాం అనే రీతిలో ఆ శాఖలో అందరు కాదు కాని కొంతమంది అధికారులు ఉండేవారు. వారియర్ ఖమ్మం లో అడుగు పెట్టిన తరువాత శాఖ పని తీరే మారింది . పని చేయకుండా తప్పించుకుని తిరిగే వారికీ కొంత ఇబ్బందిగానే ఉంది. శాఖలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పని తప్పించుకునే వాళ్ళు కొంత మంది తప్ప తమకు సరైన అధికారి వచ్చారనే అనుకుంటున్నారు ఆ శాఖలోని ఉద్యోగులు .నిరంతరం అప్రమత్తంగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ శాఖపై పలు విమర్శలు ఉన్నాయి. సివిల్ తగాదాల్లో తలదూర్చటం , షటిల్ మెంట్లు ,లాంటివి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వారియర్ రాగానే అవి మొత్తం పోయాయని కాదుకానీ, అందుకు సాహసించలేక పోతున్నారు. వారియర్ జిల్లాలో అడుగు పెట్టిన తరువాత అవి తగ్గాయి . తాను పరుగులు పెట్టడమే కాకుండా ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లా పై కొద్దీ రోజుల్లోనే ఒక అవగాహనకు వచ్చారు. అన్ని ప్రాంతాలు తిరిగారు సిబ్బందిని కదిలించారు.జిల్లాకు చుట్టూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఉండటంతో అక్కడకు వెళ్లారు .సిబ్బందితో చర్చించారు. కరోనా మహమ్మారి కర్ఫ్యూ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేరుగా సిబ్బందితో మాట్లాడారు . ప్రజలను అప్రమత్తం చేశారు మాట వినకుండా అనవసరంగా వీధుల్లోకి వచ్చే వారిపై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. వాహనదార్లతో మాట్లాడుతున్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటిస్తూ..
పోలీసులకు సహకారిస్తున్నారని వారియర్ పేర్కొంటున్నారు . ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా 90 శాతం మంది స్వీయ నియంత్రణలోనే ఉన్నారని, మిగిలిన 10 శాతం మంది మాత్రమే ఎలాంటి పని లేకున్నా రోడ్లపైకి వస్తున్నారని స్వయంగా గ్రహించి వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో శ్రమించేలా చేశారు . అవసరమైన మేరకు అవగాహన కల్పించడానికే మొగ్గు చూపుతున్నారు , లాక్ డౌన్ లో మాట వినకుండా అల్లరి చిల్లరగా తిరిగే వారిపై కఠినంగానే ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఒకటికి రెండు సార్లు చెప్పి వినని పక్షంలో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చట్టపరమైన చర్య తీసుకోవాలన్నారు .

 

రాష్ట్ర సరిహద్దులో కొనసాగుతున్న నాకాబందీ పర్వేక్షణ

రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ కల్లూరు డివిజన్ లోని పెనుబల్లి మండలం ముత్తగూడెం /తిరువూరు, బోనకల్లు / వాత్సవాయి రోడ్డు సరిహద్దు చెక్ పోస్ట్ , మధిర రూరల్ పరిధిలోని మాటూరు చెక్ పోస్టును పోలీస్ కమిషనర్ సందర్శించారు. లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు . రోజులో ఎన్ని ఎమర్జెన్సీ అంబులెన్స్, నిత్యావసర రవాణా వాహనాలు వస్తున్నాయని సిబ్బందిని వాకబు చేశారు.
అత్యవసర మెడికల్ అంబులెన్స్ ,నిత్యావసర సర్వీసులు, పాసులు వున్న వారికి మినహా ఇతరులు ఎవరూ రాష్ట్ర సరిహద్దు ప్రవేశ మార్గాలు దాటకుండ మరింత అప్రమత్తంగా ఉండాలని, చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత కఠినం చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించి జిల్లాలోకి ప్రవేశిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెర్కొన్నారు.
పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారుల పర్యవేక్షణలో వాలాంటరీలు లాక్ డౌన్ మార్గదర్శకాలు పాటిస్తూ ..కరోనా వైరస్‌ నుంచి తమ గ్రామాల ప్రజలను రక్షించుకునేందుకు
గ్రామ సరిహద్దుల బంద్‌ కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలోని పలు సరిహద్దు గ్రామాల యువత /వాలంటరీలు తమ గ్రామాల మీదుగా కొత్త వ్యక్తులెవరూ వెళ్లకుండా, గ్రామాల్లోకి రాకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

 

రాష్ట్ర సరిహద్దు దాటి గ్రామాల మీదుగా జిల్లాలోకి రాకుండా గ్రామ వాలంటరీల కాపలా పాస్ లేకుంటే ఎవరికి అనుమతి లేదు**ఆంధ్రా సరిహద్దులోని ముత్తగూడెం చెక్ పోస్టును సత్తుపల్లి MLA తో కలసి సందర్శించిన పోలీస్ కమిషనర్ **తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అమలవుతున్న లాక్ డౌన్ పరిశీలించిన పోలీస్ కమిషనర్పె పెనుబల్లి మండలం, ముత్తగూడెం గ్రామం నందు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు
రాష్ట్ర సరిహద్దు నుండి అంతర్గత దారుల వెంటా రాకుండా పోలీసు ,రెవెన్యూ,
అధికారులు గ్రామలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.. గ్రామా వాలంటరీ పటిష్ట పరిచి పోలీస్ మార్గదర్శకాలు పాటిస్తూ సరిహద్దు గ్రామలలో కాపలా కాస్తున్నారు.
మూడు షిఫ్ట్ డ్యూటీలతో 24×7 నిరంతర తనిఖీలతో
బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ రెవెన్యూ ,హెల్త్ ,ఎక్సైజ్ శాఖల సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి
రాష్ట్ర సరిహద్దు మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర రవాణా సర్వీసులకు,పాసులు వున్న వారికే మాత్రమే అనుమతిస్తున్నారని, ఎలాంటి అభ్యర్థనలు వచ్చినప్పటికీ పరిగణంలోకి తీసుకోకుండా పకడ్భందిగా నిబంధనలు అమలు చేస్తున్నారు
బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, ఆశ వర్కర్లకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మాస్కులు,
శానిటైజర్, వాటర్ బాటిల్స్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

 

 

Related posts

కారణజన్ముడు సీఎం కేసీఆర్ : ఎంపీ నామ నాగేశ్వరరావు…

Drukpadam

నోరు జారి పోలీసుల మ‌నసు నొప్పించా సారీ… ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి!

Drukpadam

హుజూరాబాద్ లో తొలిసారి టీఆర్ఎస్ కు లీడ్.. ఎంతంటే..

Drukpadam

Leave a Comment