Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ..

చంద్రబాబు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ..
బెయిల్, కస్టడీ పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
స్కిల్ కేసులో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా డిస్మిస్ చేసిన కోర్టు
ప్రస్తుతం పీటీ వారెంట్లపై విచారిస్తున్న కోర్టు…

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు , సి ఐ డి కోర్ట్ కొట్టివేసింది..దీంతో చందరబాబుకు నిరాశ తప్పలేదు ..సోమవారం బెయిల్ వస్తుందని టీడీపీ శ్రేణులు , కుటుంబసభ్యులు ఆశించారు . అయితే వారికీ నిరాశ ఎదురైంది…విజయవాడ సి ఐ డి కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించినప్పటికీ సి ఐ డి కస్టడీ పిటిషన్ కు కోర్ట్ తోసిపుచ్చింది…
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడనుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Related posts

తనపై అనర్హతను తిరిగి విచారించాలని హైకోర్టు లో వనమా పిటిషన్ …స్వీకరించిన న్యాయస్థానం

Ram Narayana

ఏపీ విభజన బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం…

Ram Narayana

మరణించిన కుమారుడి ఆస్తికి ఫస్ట్ క్లాస్ వారసురాలు తల్లే.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

Ram Narayana

Leave a Comment