Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోదీ.. నీ కాళ్లు మొక్కుతా, కక్ష మానుకో …బెంగాల్ సీఎం మమత !

-సీఎస్ రీకాల్ రాష్ట్రాలకే అవమానం
-బెంగాల్ సీఎం మమత సంచలనం
”బెంగాల్ ప్రజల బాగు కోసం అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకోడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వ్యక్తిగతంగా నన్ను ఇంత ఘోరంగా అవమానిస్తే మాత్రం సహించబోను. ఎన్నికల్లో మిమ్మల్ని(బీజేపీని) ఛీకొట్టిన బెంగాల్ ప్రజలు మమ్మల్ని(టీఎంసీ) గెలిపించారే దుగ్ధతో ఇలా చేస్తున్నారా? ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయాలేంటి? కక్షలు, ప్రతీకార రాజకీయాలు ఎప్పటికి మానేస్తారు?” అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ప్రధాని బెంగాల్ పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రోటోకాల్ వివాదాలపై సీఎం మమత శనివారం వివరణ ఇచ్చారు. కోల్ కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు..
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో టీఎంసీ సర్కారును దోషిగా నిలబెట్టేందుకు పెద్ద స్థాయిలో కుట్ర జరిగింది. సాక్ష్యాత్తూ ప్రధానమంత్రి కార్యాలయమే మాపై నెగటివ్ క్యాంపెయిన్ నడిపింది. మోదీ పక్కనే ఖాళీ కూర్చీల ఫొటోలను పీఎంవోనే బీజేపీ నేతలకు షేర్ చేసింది. ప్రధాని బెంగాల్ పర్యటనలో జరిగింది వేరు.. బీజేపీ ప్రాపగండా చేస్తున్నది వేరు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం నేను విస్తృతంగా పర్యటించాను. వాతావరణం అనుకూలించక ఆలస్యమైంది. తీరా కాలైకుండ ఎయిర్ బేస్ లో ప్రధానికి కలవడానికి వెళ్లగా.కలైకుండ ఎయిర్ బేస్ లో ప్రధాని ఉన్న చోటికి మేం వెళ్లగా, ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆల్రెడీ మీటింగ్ మొదలైందని, ముగియడానికి గంట పడుతుందని, అప్పటిదాకా వెయిట్ చేయాలని అన్నారు. పీఎంతో సీఎంకు విడిగా సమాశం ఉంటుందని మొదటి నాకు చెప్పారు. కానీ ప్రధాని సమీక్షలో మాత్రం బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు. ఇది ఏం పద్ధతో నాకైతే అర్థంకాలేదు. అందుకే తుపాను అంచనా రిపోర్టులతోపాటు సాయం కోరుతూ వినతి పత్రాన్ని అందించి నేను వెనుదిరిగాను. భారీ మెజార్టీతో గెలుపొందిన మమ్మల్ని ప్రధాని ఇంతలా అవమానించడం ఏమాత్రం తగదు. అదీగాక..కక్షపూరిత రాజకీయాల కోసం చీఫ్ సెక్రటరీని రీకాల్ చేస్తారా? ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి, కేంద్రం ఒక సీఎస్ పట్ల ఇలా వ్యవహరించడం రాష్ట్రాలను, ఫెడరల్ వ్యవస్థను అవమానించినట్లు కాదా? బెంగాల్ సీఎస్ ఆలాపన్‌ బంధోపాధ్యాయను రీకాల్ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి” అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇప్పటికే రిటెరైన ఆలాపన్‌ పదవీకాలాన్ని 4 రోజుల క్రితమే 3 నెలలపాటు పొడగించిన కేంద్రం.. మోదీ పర్యటనకు గైర్హాజరు తర్వాత ఆయను బెంగాల్‌ నుంచి వెనక్కి రప్పించింది. మే 31లో డీవోపీటీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, యాస్‌ తుఫాను ప్రభావిత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌లకు తక్షణ సాయం కింద ప్రధాని మోదీ చెరో వెయ్యి కోట్లు ప్రకటించారు.

 

Related posts

సిట్ చార్జ్‌షీట్‌పై ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేంద్ర మంత్రి బూతులు, దాడి!

Drukpadam

3 రాజ‌ధానులే మా విధానం.. స‌భ‌లో బిల్లు పెడ‌తాం: బొత్స …

Drukpadam

ఆత్మకూరు బరిలో బీజేపీ …జనసేన తో కలిసి పోటీ : జివిఎల్

Drukpadam

Leave a Comment