Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య

  • పల్నాడు జిల్లా గురజాల మండలంలో దారుణ ఘటన
  • కళ్లలో కారం చల్లి.. దారుణ హత్య
  • గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు

ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కూనిరెడ్డి కృష్టారెడ్డి అనే వైసీపీ కార్యకర్తను ప్రత్యర్థులు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి అత్యంత దారుణంగా హతమార్చారు. జిల్లాలోని జంగమహేశ్వరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్య జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు. పరిస్థితులు చేజారకుండా గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని చంపిన వారిని పట్టుకునేందుకు మూడు స్పెషల్ టీమ్ లను పోలీసు శాఖ రంగంలోకి దింపింది. 

కృష్ణారెడ్డి పులిపాడు ప్రభుత్వ వైన్ షాప్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్లలో కారం చల్లి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు రాజకీయాలు కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గురజాల మండలంలో ఉన్న జంగమహేశ్వరం గ్రామానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉండటం గమనార్హం. మరోవైపు, టీడీపీ వాళ్లే ఈ హత్య చేయించారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Related posts

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి..

Drukpadam

ప్రధాని మోడీతో ఏపీ మంత్రి అమర్నాథ్ సెల్ఫీ పై ట్రోలింగ్స్ …

Drukpadam

టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అర్హ‌త‌లున్నాయి: ఏపీ హైకోర్టు

Drukpadam

Leave a Comment