Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సరుకులు మోసుకుంటూ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన చైనా వ్యోమనౌక!

  • అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో చైనా వడివడిగా అడుగులు
  • తియాన్హే పేరుతో నిర్మాణం
  • లాంగ్‌మార్చ్-7వై3 రాకెట్ ద్వారా వ్యోమనౌకను పంపిన చైనా
  • ఆహారం, సరుకులు, రెండు టన్నుల ఇంధనంతో నింగికెగసిన తియాన్‌ఝౌ-2

తనకంటూ ఓ తియాన్హే పేరుతో భూ కక్ష్యలో ఓ అంతరిక్షకేంద్రాన్ని నిర్మించుకుంటున్న చైనా ఈ దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది. అంతరిక్షకేంద్రం నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రితో నిన్న చైనా సరుకు రవాణా వ్యోమనౌక తియాన్‌ఝౌ-2 నింగిలోకి పయనమైంది. లాంగ్‌మార్చ్-7 వై3 రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపారు. నిజానికీ ప్రయోగం గత వారమే జరగాల్సి ఉండగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది.

అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన భాగం ఇప్పటికే రోదసీలోకి చేరుకోగా, తాజాగా నిన్న తియాన్‌ఝౌ-2 మరికొన్ని విడిభాగాలను తీసుకుని పయనమైంది. అంతరిక్ష కేంద్రానికి మున్ముందు వెళ్లబోయే వ్యోమగాముల కోసం ఆహారం, సరుకులు, సైన్స్ పరికరాలు, అంతరిక్ష కేంద్రం కోసం రెండు టన్నుల ఇంధనాన్ని ఇది తీసుకెళ్లింది. త్వరలోనే ముగ్గురు వ్యోమగాములు షెంఝౌ-12 వ్యోమనౌకలో అక్కడికి వెళ్లనున్నారు. మూడు నెలలపాటు వారు అక్కడే ఉండి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తారు.

Related posts

ఆత్మలతో మాట్లాడతానని ఇంటినుంచి వెళ్ళిపోయినా బాలిక…రెండు నెలలైనా ఆచూకీ శూన్యం!

Drukpadam

ప్రపంచంలోనే అత్యధికకాలం 22 సంవత్సరాలు జీవించిన శునకం మృతి!

Drukpadam

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్

Drukpadam

Leave a Comment