Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

తాత గారి ఎన్నికల ప్రచారం లో మనవళ్ళు హల్చల్ ..

తాత గారి ఎన్నికల ప్రచారం లో మనవళ్ళు హల్చల్ ..
మురిసిపోయిన తాత…ముగ్గరు మనవళ్ల పాల్గొనడంతో సంతోషం వ్యక్తం చేసిన తుమ్మల
తాతకు ఓటేయాలని ప్లే కార్డులు పట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మనవాళ్ళు
శనివారం సాయంత్రం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో ప్రచారం

మాజీ మంత్రివర్యులు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
తుమ్మల నాగేశ్వరరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన మనవాళ్ళు చేసిన ప్రచారం పలువురిని ఆకట్టుకున్నది …ఈర్లపుడిలో ఏర్పాటుచేసిన ర్యాలీలో తుమ్మల మనవళ్లు మాస్టర్ హితేష్, యువన్, ప్రయాగ్ ,ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు … తాతగారైన తుమ్మల గారికి ఓటు వేయాలని ప్లేకార్డ్ పట్టుకొని ప్రచారం నిర్వహించారు. తాత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీచేస్తుండటంతో శని ,ఆదివారాలు సెలవలు కావడంతో వారు వచ్చారు ..వారిని చూడగానే ప్రజలు సైతం ఆసక్తిగా వారిని గురించి ఆరా తీశారు ..చిన్నపిల్లలైనా ముగ్గరు మనవాళ్ళు హల్చల్ చేయడం ముచ్చటగా మారింది …

Related posts

ఖమ్మంలో ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు …హోరెత్తిన సంబరాలు

Ram Narayana

రాకేష్ రెడ్డిని గెలిపించండి ..ఎంపీ వద్దిరాజు …

Ram Narayana

ఖమ్మం నగరానికి నాలుగు దిక్కులా ఖబరస్థాన్ ల ఏర్పాటుకు చర్యలు… మంత్రి తుమ్మల

Ram Narayana

Leave a Comment