Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

రైతుబంధు పంపిణీకి అనుమతివ్వాలని ఈసీకి బీఆర్ఎస్ మరోసారి విజ్ఞప్తి

  • 28వ తేదీ లోపు రైతుబంధు పంపిణీ చేయాలని ఆదేశించిన ఈసీ
  • రైతుబంధు గురించి ప్రస్తావించవద్దని షరతు
  • హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో అనుమతి ఉపసంహరించుకున్న ఈసీ
  • తాజా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి  

రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ మరోసారి విజ్ఞప్తి చేసింది. తొలుత రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మరోసారి ఈసీని ఆశ్రయించింది. అనుమతిని నిరాకరిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. 

ఈ నెల 28వ తేదీలోపు రైతుబంధు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు గురించి ఎక్కడా ప్రస్తావించరాదని ఈసీ షరతులు విధించింది. ఈ పథకం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. అయితే రైతుబంధుపై మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు చేయడంతో ఈసీ అనుమతిని నిరాకరించింది. దీంతో బీఆర్ఎస్ ఈసీ వద్దకు మరోసారి వెళ్లింది.

Related posts

అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల జారీ

Ram Narayana

నేటితో ముగియనున్న ఎన్నికలు.. సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూపులు!

Ram Narayana

పశ్చిమ బెంగాల్‌లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం…

Ram Narayana

Leave a Comment