Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిలీవ్ కు నో : స్పష్టం చేసిన మమతా బెనర్జీ

బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిలీవ్ కు నో : స్పష్టం చేసిన మమతా బెనర్జీ
-ప్రధాన కార్యదర్శిని డిప్యుటేషన్‌పై పిలిపించిన కేంద్రం
-కేంద్ర స‌ర్కారు ఆదేశాలు షాక్‌కు గురిచేశాయ‌ని వ్యాఖ్య
-ప్ర‌స్తుత పరిస్థితుల్లో రిలీవ్ చేయలేమన్న మమత

కేంద్రం ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల మధ్య నడుస్తున్న వార్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో మరోసారి వివాదాస్పదమైంది . ఇటీవల బెంగాల్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ప్రధానిని కేవలం 15 నిముషాలు మాత్రమే కలిసిన మమతా సమీక్షా సమావేశంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు . ఆమెతో పటు ప్రధానకార్యదర్శిని కూడా తీసుకొని వెళ్లడం తీవ్ర విమర్శలకు దారితీసింది . కేంద్రం వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రీకాల్ చేస్తూ కేంద్ర సర్వీసులలో చేరాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అందుకు మమతా ససేమీరా అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రీకాల్ చేయడమంటే రాష్ట్రప్రభుత్వానికి పెద్ద అవమానం అందుకు అంగీకరించం … అంటూ ప్రధాని మోడీ కి ఆమె లేఖ రాస్తూ మరోసారి షాక్ ఇచ్చారు. కేంద్రం కోరినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్‌ను డిప్యుటేషన్‌పై వెనక్కి పంపించే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. ఆయ‌న‌ను కేంద్ర స‌ర్వీసుల‌కు పంపించేది లేదని ఆమె ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు.

కేంద్ర స‌ర్కారు ఏక‌ప‌క్షంగా ఇచ్చిన ఆదేశం త‌న‌ను షాక్‌కు గురిచేసింద‌ని మమత పేర్కొన్నారు. ప్ర‌స్తుత పరిస్థితుల్లో ప‌శ్చిమ‌ బెంగాల్ ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని రిలీవ్ చేయ‌దని, గ‌తంలో ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని పొడిగిస్తూ ఇచ్చిన చ‌ట్ట‌ప‌ర‌మైన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయ‌ని తాము భావిస్తున్న‌ట్లు తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించే యోచనలోనూ ఉన్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

Related posts

ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం…

Ram Narayana

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా!

Drukpadam

ఏమైపోయావయ్యా.. అమాత్యా.. మూడు వారాలుగా కనిపించని చైనా విదేశాంగ మంత్రి

Drukpadam

Leave a Comment