- ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
- తొలి విడతలో 11 మంది మంత్రులుగా ప్రమాణం
- సీతక్క, సురేఖలను ఆప్యాయంగా హత్తుకున్న సోనియాగాంధీ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసింది వీరే:
మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో దామోదర్ రాజనర్సింహ ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా… మిగిలిన వారందరూ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన సీతక్క, కొండా సురేఖలను సోనియాగాంధీ ఆప్యాయంగా హత్తుకుని, అభినందనలు తెలియజేశారు. మంత్రులకు శాఖలను కేటాయించాల్సి ఉంది.