Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతపై కేరళ సీఎం ఆందోళన:కేంద్రంపై వత్తిడికి కలిసి రావాలని11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ…

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతపై కేరళ సీఎం ఆందోళన 
-11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన పినరై విజయన్
-దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత
-నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్
-బీజేపీయేతర రాష్ట్రాలకు కేరళ సీఎం లేఖ
-కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వెల్లడి
-కలిసికట్టుగా ముందుకెళదామని పిలుపు

కేరళ సీఎం విజయన్ దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రంపై వత్తిడికి కలిసిరావాల్సిందిగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ 11 రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి లేఖ రాశారు. వ్యాక్సిన్ సేకరణ కోసం కలిసికట్టుగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రాలే సొంతంగా డోసులు సమకూర్చుకోవాలన్నది కేంద్రం వైఖరిగా తెలుస్తోందని, కానీ, డిమాండ్ కు తగిన విధంగా వ్యాక్సిన్ల లభ్యత లేదని కేరళ సీఎం అభిప్రాయపడ్డారు. అన్ని కేంద్రం చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాలను అప్రతిష్ఠపాలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని ఆయన అభిప్రాయం పడ్డారు . కరోనా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడలిసిన సమయంలో అందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరించడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందువల్ల అందరం సమిష్టిగా కేంద్రంపై వత్తిడి తెచ్చి వ్యాక్సిన్ పంపిణి విషయంలో జరుగుతున్నా జాప్యం పై వత్తిడి పెంచే అవకాశం ఉందన్నారు . ఆయన లేఖలు రాసిన ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్రాల ఉన్నాయి . ఇది గడ్డుకాలం అందుకు మనందరి మధ్య సమన్వయం అవసరం అని సీఎంలకు రాసిన లేఖలో ఈ మేరకు పేర్కొన్నారు. విజయన్ ఇప్పటికే ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. దేశానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని సూచించారు.ఆయన ఇప్పటీకే ప్రధానికి సూచించారు .

Related posts

సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం…బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు!

Drukpadam

అన్నకు షర్మిలకు బాసట … కేటీఆర్ మాటలపై విమర్శల జల్లు!

Drukpadam

సీఎం గారు కుర్చీ ఎక్కడ …పోడుభూముల ధర్నాలో నాయకుల ప్రశ్న ?

Drukpadam

Leave a Comment