Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రానికి మమతా మరో షాక్ ….. మోడీ వెర్సస్ మమతా…

కేంద్రానికి మమతా మరో షాక్ ….. మోడీ వెర్సస్ మమతా
-బెంగాల్ సి ఎస్ పై వేటు … తనకు ఎక్సటెన్షన్ వద్దే వద్దని సి ఎస్ కేంద్రానికి లేఖ
-ఆపై రిటైర్ మెంట్ … బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా నియామకం
-రీకాల్ చేసిన సి ఎస్ ను రిటైర్ మెంట్ అయిన వెంటనే ముఖ్య సలహాదారుగా నియామకం
-మే 31 అధికారికంగానే రిటైర్ అయిన బెంగాల్ సి ఎస్ బందోపాధ్యాయ
-రీకాల్ చేసే అధికారం ఉన్నా, రాష్ట్రాన్ని సంప్రదించాల్సిందే అంటున్న ఐఏఎస్ లు
-రాష్ట్రాన్ని సంప్రదించకుండా రీకాల్ చేయడం పైమాజీ ఐఏఎస్ లలో అసంతృప్తి
– తనకు పదవి పొడగింపు వద్దని లేఖ రాసిన బందోపాధ్యాయ
– రాష్ట్రాలపై కేంద్రం జోక్యంపై మరోసారి చర్చ
-ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమంటున్న పరిశీలకులు
కేంద్రం ,పశ్చిమ బెంగాల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజుకో మలుపు తిరుగుతుంది. యాష్ తుఫాన్ ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ ప్రత్యేకంగా తుఫాన్ ప్రాంతనాలను పరిశీలించి ఆయారాష్ట్రాల ముఖ్యమంత్రులతో ,అధికారులతో సమీక్ష జరిపి నష్టాలపై అంచనావేసి కేంద్రం నుంచి సహాయం అందించేందుకు వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు రాకపోవడం పి ఎం ఓ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది . పైగా ప్రధాని వచ్చిన తరువాత అరగంట ఆమె కోసం ప్రధాని వేచిచూసేలా చేశారని పేర్కొన్నది . ఆమె వచ్చిన తరువాత కూడా కేవలం 15 నిమిలాషలు మాత్రమే ఉండి సమీక్ష సమావేశంలో పాల్గొనకుండా ప్రధానికి 20 వేల కోట్ల రూపాయలు సహాయం కావాలని ఒక నివేదిక అందజేసి వెళ్లిపోవడంపై ప్రధానమంత్రి కార్యాలయం మండి పడింది . ఆమెతో పాటు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఆమె వెంటనే వెళ్లిపోవడం ప్రధాన మంత్రిని అవమానించడమే అని పి ఎం ఓ పేర్కొన్నది .దీంతో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని రీకాల్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా అలాఫ్ బందోపాధ్యాయ మే 31 రిటైర్ కావాల్సి ఉండగా ఆయన సేవలు మరింత అవసరమని భావించిన మమతా మరో మూడు నెలలు పదవి కాలాన్ని పొడగించుకున్నారు . ఇది కేంద్రం ద్వారా జరగాల్సిన ప్రక్రియ అందువల్ల కేంద్ర హోమ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ విజ్నప్తి మేరకు బందోపాధ్యాయ కు మూడునెలలు పదవి కాలాన్ని పొడగించింది . ప్రధాని పర్యాటన లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా సి ఎస్ పైన చర్యలకు కేంద్రం పూనుకోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవమానంగా ఫీలయ్యారు . దీంతో ఆమె కొత్త ఎత్తు వేశారు . ఆయన తనకు కేంద్రం పొడిగించిన కాలం పని చేయలేనని తాను రిటైర్ మెంట్ అవుతున్నారు కేంద్రానికి లేఖ రాసి రిటైర్ తీసుకున్నారు . ఆయన రిటైర్ కావడంతోనే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సీఎం ఆయన్ను మూడు సంవత్సరాలకు నియమించారు . దీంతో మండి పడ్డ కేంద్రం బందోపాధ్యాయ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది .
కేంద్రానికి బెంగాల్ ప్రభుత్వానికి జరుగుతున్నా పోరులో ప్రభుత్వ అధికారులపై వేటు వేయడం , చర్యలకు ఉపక్రమించడంపై పలువురు మాజీ ఐఏఎస్ లు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఒకవేళ రాష్ట్రాలలో ఉన్న ఏ ఐఏఎస్ , లేదా ఐ పి ఎస్ అధికారిపైన అయిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైతే అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. డైరెక్ట్ గా కేంద్రం చర్యలు తీసుకునే పని అయితే రాష్ట్రాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు . అందువల్ల బెంగాల్ సి ఎస్ పై చర్యలు సమర్ధనీయం కాదని అంటున్నారు . ఈ లాంటి చర్యలవలన మొత్తం బ్యూరో క్రసి పై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ఎవరు అధికారంలో ఉన్న వ్యవస్థలను కాపాడవలసిన భాద్యత ఉంటుందని వారు అభిప్రాయం పడుతున్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలి కానీ మాటిమాటికి ఘర్షణ వాతావరణం ఎవరికీ మంచిది కాదని హితవు పలుకుతున్నారు . కేంద్రం ,రాష్ట్రాలు పరిపాలనలో ఎవరికీ వారే స్వతంత్రులని అలాకాకుండా రాష్ట్రాలలో పని చేస్తున్న అధికారులపై నేరుగా కేంద్రం చర్యలకు ఉపక్రమించాడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పరిశీలకులు అంటున్నారు.

Related posts

పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?: రేవంత్ రెడ్డి

Drukpadam

స్టేషన్ల వినియోగ రుసుము పేరిట… రైలు ప్రయాణికులపై కొత్త చార్జీ బాదుడు!

Drukpadam

ఆవేశంలో అన్న మాటలు అవి… వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వివరణ!

Drukpadam

Leave a Comment