Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

నామినేటెడ్ ఎమ్మెల్సీలపై శుక్రవారం హైకోర్టు లో విచారణ …

బీఆర్ఎస్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడంపై శుక్రవారం హైకోర్టులో విచారణ

  • శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన గత ప్రభుత్వం
  • తిరస్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దాసోజు, కుర్రా సత్యనారాయణ
BRS leaders petition in High Court on MLC issue

గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జులైలో కేబినెట్ తీర్మానం చేసింది. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. అయితే గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని.. కేబినెట్‌కు ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.

Related posts

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా

Ram Narayana

విదేశాలకు వెళ్లాలి… అనుమతి ఇవ్వండి: సీబీఐ కోర్టును కోరిన సీఎం జగన్…

Ram Narayana

అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం ఆపేయండి: హైకోర్టు

Ram Narayana

Leave a Comment