Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఎన్నికల్లో పోటీ చేయాలని మూడు రాజకీయ పార్టీలు నన్ను ఒత్తిడి చేస్తున్నాయి: ప్రకాశ్ రాజ్

  • కోజికోడ్ లో కేరళ సాహితీ ఉత్సవం
  • హాజరైన నటుడు ప్రకాశ్ రాజ్
  • పార్టీల ఒత్తిడి భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసుకున్నానని వెల్లడి 

కోజికోడ్ లో జరిగిన కేరళ సాహితీ ఉత్సవంలో పాల్గొన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మూడు రాజకీయ పార్టీలు తన వెంట పడ్డాయని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల బరిలో దిగాలంటూ ఆ పార్టీలు తనను ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు. ఆ మూడు పార్టీల ఒత్తిళ్లను తట్టుకోలేక ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. 

“రాజకీయ పార్టీలకు అభ్యర్థులు ఎందుకు దొరకడంలేదు? మోదీపై వ్యతిరేకత తప్ప వాళ్లకంటూ సొంత అజెండా ఉండడంలేదు. వాళ్లు ప్రజల కోసం రావడంలేదు. అందుకే వాళ్లకు అభ్యర్థులు దొరకడంలేదు. ఇవాళ అభ్యర్థుల కోసం వెదుక్కునే దుర్భర పరిస్థితి వచ్చిందా? నేను ప్రధాని మోదీని విమర్శిస్తున్నందునే ఆ పార్టీలు నా వెంట పడుతున్నాయి. అంతే తప్ప వాళ్లు నా సిద్ధాంతాలను చూడడంలేదు” అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.

Related posts

పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

Ram Narayana

నేడు వాయనాడ్‌లో ప్రియాంక నామినేషన్!

Ram Narayana

ఇందిరాగాంధీ పేరుందని స్కూలు మారాడట.. మహా సీఎం ఫడ్నవీస్ చిన్ననాటి సంఘటన!

Ram Narayana

Leave a Comment