Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో కాంగ్రెస్ కాంగ్రెస్ కు గుడ్ బై … 200 మంది తెరాసలో చేరిక…

 

◆ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి పువ్వాడ.
◆అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పని అని మంత్రి విమర్శ
◆కాంగ్రెస్ లో పని చేసే కార్యకర్తలకు గుర్తింపు లేదు
◆కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి
ఎప్పటినుంచో కాంగ్రెస్ ఉన్న అనేకమంది ఖమ్మం నగరంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో టీఆర్ యస్ లో చేరారు . సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులూ మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ కు ముఖ్య అనుచరుడిగా చాలాకాలం ఉన్న ఫరీద్ ఖాద్రి టీఆర్ యస్ లో చేరడం ఖమ్మం లో చెప్పుకోదగ్గ విషయం . కాంగ్రెస్ అధికారంలో ఉన్న లేకపోయినా కాంగ్రెస్ వాదిగా ఖాద్రీకి పేరుంది. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ తరుపున డివిజన్ లో అభ్యర్థిని పోటీలో పెట్టి ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ వల్ల లాభం లేదనుకొని టీఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కు ఖమ్మం లో సరైన నాయకుడు లేకపోవడం తమను ఆదుకునే వారు లేరనే ఉద్దేశంతో పలువురు కాంగ్రెస్ గుడ్ బై చెప్పారు . తెరాస నాయకులు ఇస్సాక్ షేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫరీద్ ఖాద్రి తో పాటు 200 మంది నాయకులు, కార్యకర్తలు జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో సోమనబోయిన స్వర్ణ, తోడేటి వసంత, 2,3వ టౌన్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ జిలాని, ఎస్ కె జానీ, టౌన్ మైనార్టీ ఉపాధ్యక్షుడు, 2టౌన్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు ఎండి కరీం, సాజిదా బేగం, షామిమ్, గౌస్ ఖాద్రి, సయ్యద్ ఇస్మాయిల్, ఫసిఉద్దీన్ , రవి , చైతన్య యాదవ్ , చిర్రా హనుమంతరావు , వెంకటేష్ తదితరులు పార్టీలో చేరారు..

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో పనిచేసే కార్యకర్తలను గుర్తించదని మంత్రి పువ్వాడ అన్నారు. అభివృద్ధికి అడ్డుపడటమే వారి ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల వారికి సంక్షేమం, అభివృద్ధి సమంగా అందిస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో పలుపంచుకునేందుకు అన్ని పార్టీల నుండి తెరాసతో నడుస్తున్నారని అన్నారు.

కార్యక్రమంలో పార్టీ కార్యాలయ ఇంచార్జి RJC కృష్ణ , మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ విజయ్ , కార్పొరేటర్ కమర్తపు మురళి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు ఉన్నారు.

Related posts

వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ…!

Drukpadam

ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీ!

Drukpadam

ఏపీలో 4 సీట్లూ వైసీపీవే!… ఆశావ‌హుల జాబితా ఇదే!

Drukpadam

Leave a Comment