Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సరిహద్దుల్లో పైపుల ద్వారా భారత్ కు హెరాయిన్ పంపుతున్న స్మగర్లు

సరిహద్దుల్లో పైపుల ద్వారా భారత్ కు హెరాయిన్ పంపుతున్న స్మగర్లు
-భారత్-పాకిస్థాన్ సరిహద్దులో రూ. 270 కోట్ల మత్తు పదార్థాల పట్టివేత
-రాజస్థాన్‌లోని కాజూవాలా ప్రాంతంలో ఘటన
-భారీ వర్షాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు స్మగ్లర్ల యత్నం
-తిప్పి కొట్టి భద్రతా బలగాలు
-ఈ స్థాయిలో మత్తు పదార్థాలు లభ్యం కావడం ఇక్కడ ఇదే తొలిసారి

పైపుల ద్వారా భారత్‌లోకి పాక్ స్మగ్లర్లు పంపిస్తున్న రూ. 270 కోట్ల విలువైన హెరాయిన్‌ను భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. బికనేర్‌లోని కాజూవాలా ప్రాంతంలో నిన్న భారీ వర్షం కురిసింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న పాక్ స్మగ్లర్లు పీవీసీ పైపుల ద్వారా భారత్‌లోకి పెద్ద ఎత్తున హెరాయిన్‌ను పంపేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ బలగాలు వెంటనే స్మగ్లర్లపై కాల్పులు ప్రారంభించాయి. అనంతరం నిర్వహించిన సోదాల్లో 54 ప్యాకెట్లలో 58.6 కిలోల బరువున్న హెరాయిన్‌ను లభ్యమైంది. దీని విలువ రూ. 270 కోట్ల వరకు ఉంటుదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్దమొత్తంలో మత్తుపదార్థాలు పట్టుబడడం ఇదే తొలిసారని బీఎస్ఎఫ్ తెలిపింది.దీనిపై భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.

Related posts

మహిళా వ్యాపార భాగస్వామిని చితకబాదిన స్పా మేనేజర్…

Ram Narayana

కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య.. వెంట వెళ్లిన వారే హంతకులా?

Ram Narayana

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఎనిమిది మంది మృతి!

Drukpadam

Leave a Comment