Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ కు ఎమ్మెల్యే పదవికి ఈటల గుడ్ బై ;కేసీఆర్ పై నిప్పులు…

టీఆర్ యస్ కు ఎమ్మెల్యే పదవికి ఈటల గుడ్ బై ;కేసీఆర్ పై నిప్పులు
-ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి , తలా ఉమా రాజీనామా
-హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అనేక మంది రాజీనామా
-రేపటి నుంచి రాజీనామాలు ఎక్కువ ఉంటాయన్న ఈటల

అనుకున్నదే జరిగింది. మాజీ మంత్రి ఈటల ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ యస్ పార్టీ కి గుడ్ బై చెప్పారు. 19 సంవత్సరాల పాటు టీఆర్ యస్ తో ఉన్న అనుబందాన్ని వీడుతున్నట్లు ప్రకటించారు. అనేక విషయాలపై పాలనపై తన ఆవేదన వ్యక్తం చేస్తూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు . అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణాలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఈటల పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనను తీవ్ర స్వరంతో తూర్పార బట్టారు .కేసీఆర్ లో ప్రజాస్వామిక విలువలు ఏమాత్రం లేవని ధ్వజమెత్తారు .అనేక సందర్బాలలో తాను ప్రజాస్వామ్య పద్దతులపై మాట్లాడితే ఆయనకు నచ్చేది కాదన్నారు. ఆయన చెప్పిందే చట్టం .అనుకున్నదే శాసనం అనే ధోరణిలో వ్యవహరించారని అలాంటి వ్యక్తి చేతిలో పాలన ఉండటం ప్రజాస్వామ్యానికి తీరని విఘాతమని హెచ్చరించారు. చట్టాలు , రాజ్యాంగ విలువలు కాపాడవలసిన వ్యక్తి రాచరిక పోకడలతో మంత్రులను ఎమ్మెల్యేలను చీడపురుగుల్లా చూశారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏ ఒక్కరి త్యాగంతోనో రాలేదని అనేక మంది బిడ్డల బలిదానం, మా అందరి రెక్కల కష్టమని అన్నారు. ఉద్యమకారులను ఒక్కొక్కరిని దూరం చేసి ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని వారిని అందలం ఎక్కించిన ఘనత కేసీఆర్ కె చెల్లిందని అన్నారు. ఎవడో అనామకుడు లేఖ రాస్తే మంత్రినైన తన వివరణ కనీసం కోరకుండా చర్యలు ఏమిటని ప్రశ్నించారు. ఉరిశిక్ష పడ్డ వ్యక్తినైనా చివర కోరిక అడుగుతారని, కాని అది జరగక పొగ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా, సమయం ఇవ్వలేదని ఇదేనా విశ్వాసం అని నిలదీశారు. పార్టీలోనూ ప్రభుత్వంలో అనేక అవమానాలు పడ్డామని, నేనే కాదు మంత్రులు ఎమ్మెల్యేలు అవమానాలు పడ్డవారేనని అన్నారు. చివరకు హరీష్ రావు కూడా అవమాన పడ్డారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కు సంబందించిన ఒక సమస్యపై ముఖ్యమంత్రి ని కలిసేందుకు ప్రగతి భవన్ కు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలం కట్టగట్టుకుని కార్లు తీసుకోని పొతే కనీసం గేటు లోపాలకి కూడా వెళ్లేందుకు అవకాశం ఇవ్వలేదని, కలవక పోయినా లోనికి వెళ్లి బయటకు వస్తామన్నాఅంగీకరించలేదని , ఇది ఒకసారి కాదు మూడు సార్లు ఇలా అవమానం జరిగిందని ఆనాడే ఎందుకు ఈ భాద్యత లేని మంత్రి పదవి అని చెప్పున సందర్భాన్ని గుర్తు చేశారు. ఇది ప్రగతి భవన్ కాదు బానిసలకు నిలయం అని బోర్డ్ పెట్టుకోమని సంతోష్ తో అన్నానని ఈటల తెలిపారు.
ప్రగతి భవన్ లో ఎస్సీ , ఎస్టీ ,బీసీ కి చెందిన ఒక్క ఐఏఎస్ అధికారి అయినా ఉన్నారా ? అంటే లేరని ఆయనకు వారు అంటే ఇష్టం లేదని అన్నారు. తోలి ముఖ్యమంత్రి దళితున్ని చేద్దాం అన్న కేసీఆర్ మాటంటే మాటే తలకాయ తెగిపడ్డ మాటతప్పనని చెప్పి దళితున్ని ముఖ్యమంత్రి ని ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు .

బి ఫామ్ ఇవ్వగానే ఎమ్మెల్యే లు ఎంపీ లు కాలేరు ….

బి ఫామ్ ఇవ్వగానే ఎమ్మెల్యేలు ,ఎంపీలు కాలేరు ప్రజల్లో ఉండాలి .మీరు బి ఫామ్ ఇచ్చిన మీకూతురు కవిత ఎందుకు ఓడిపోయింది. కరీంనగర్ నుంచి పోటీ చేసిన వినోద్ ఎందుకు ఓడిపోయారు. పదవులు ఇచ్చాం అంటున్నారు. పదవులు బిక్ష కాదు హక్కు మాకష్టార్జితం తెలంగాణ కోసం కొట్లాడినం . నిద్రలు లేని రాత్రులు ఉద్యమం కోసం గడిపాము అని అన్నారు. తెలంగాణ అనేది 80 శాతంగా ఉన్న అణగారిన వర్గాలది అని కేసీఆర్ అన్న సందర్భాలను గుర్తు చేశారు.

మంత్రులు లేకుండానే శాఖల మీటింగులు

పేరుకే మంత్రులు కాని మంత్రులు లేకుండానే అధికారులతో మీటింగులు పెట్టడం ఎక్కడైనా ఉందా? కాని అది తెలంగాణ లో జరుగుతుందని అన్నారు. మంత్రుల మీద ,ఎమ్మెల్యేలు మీద విశ్వాసం కేసీఆర్ కు ఏమాత్రం లేదన్నారు. వారిని చీడపురుగుల్లా ,తీసిపారేయడం ఆయన రాజరిక పోకడలకు నిదర్శనం అన్నారు .

అన్ని సంఘాలకు కవిత నే నాయకురాలు

ఉద్యమం కోసం అనేక సంఘాలు ఏర్పాటు చేశాం . వాటిలో ప్రధానమైనవి బొగ్గుగని కార్మిక సంఘం , ఆర్టీసీ , ఎలక్ట్రిసిటీ యూనియన్లు పెట్టాం సంఘాలు పెట్టిన వాళ్ళను కాదని నాయకత్వం కవిత కు అప్పగించారు . తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను వెనక్కు నెట్టారు. ఇదేమని ప్రశ్నిస్తే వేధింపులు . ఆర్టీసీ సమ్మె జరిగింది ,దాన్ని అణిచేందుకు నానారకాలుగా కార్మికులను ఇబ్బందులకు గురిచేసింది నిజం కాదా ? వాళ్ళ బిక్షం ఎత్తుకున్నారు. మిమ్ములను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడని అనలేదా ? అనేక మంది కార్మికులు చనిపోలేదా ? చివరకు తెలంగాణ ఉద్యమంలో బస్సు లు కదలకుండా చేసి ఉద్యమానికి నాయకత్వ వహించిన అశ్వథ్థామ రెడ్డి ని బలవంతంగా రాజీనామా చేయించలేదా?

మనకొక న్యాయం ఎదుటివారికొక న్యాయమా ?

తెలంగాణ ఉద్యమ కాలంలో మనకు అన్ని సంఘాలు కావాలి … ఉద్యమాలు నడవాలి అని చెప్పినమనమే అధికారంలోకి వచ్చిన తరువాత వాటి వాసన కూడా గిట్టదాయె ఇదెక్కడి న్యాయం . చివరకు ఉద్యమం వేదిక అయినా ఇందిరాపార్క్ ను సైతం లేకుండా చేశావు …ధర్నా చౌక్ ను ఎత్తి వేస్తె కోర్ట్ లు జోక్యం చేసుకోవాల్సి వచ్చిన మాట నిజం కాదా ?

కేటీఆర్ సీఎం అంటే మేము కూడా ఒకే అన్నాం…

మనది రాజరికం కాదు … కుటుంబ పార్టీ అంతకన్నా కాదు … లాలూ ప్రసాద్ , మాయావతి , జయలలిత లాంటి కుటుంబ పార్టీలు కావు ….. ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కాని జరుగుతున్నదేమిటి రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు. అయినా కేటీఆర్ సీఎం అంటే ఒకే అన్నాం … హరీష్ రావు కూడా కేటీఆర్ కింద పనిచేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. ఉద్యమకాలంలో ఏమి చెప్పారు మీరు …. నాకు ఎవరు లేరు నేను నాభార్య తప్ప అన్నారు….. నీకు ఎవరు దిక్కు లేనినాడు ,నిన్ను మోసిన వాళ్లకు,… కాపాడిన వాళ్ళు బయటవాళ్ళు అయ్యారు…. నిన్ను తెగనాడిన వాళ్ళు ఇప్పడు కావలసిన వాళ్ళు అయ్యారు. నీది నీచ ,నీక్రుష్ట చరిత్ర , కుట్రలు ,కుతంత్రాలు ,గజకర్ణ గోకర్ణ విద్యలు తెలుసు … కాని కర్నూల్ రోడ్లమీద రక్తం పారింది. మానుకోట ఉద్యమం చేసింది ఎవరు మేము కదా ? మాకు ఎదో మీదయతో వచ్చిన పదవి కాదు వళ్ళు వంచి కొట్లాడితే వచ్చిన పదవి ఎవరి దయతోనో రాలేదు. …అడిగితె ఇచ్చేది కాయో ,పండో కాని కాట్లాడ్తే వచింది హక్కు …. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎందుకు అంటున్నావు. చివరికి అధికారులకు కూడా స్వేచ్ఛలేదు. స్వతంత్రంగా పని చేసే పద్దతి లేదు . …ప్రతిపక్షపార్టీ లను అసలు కలిసేదే లేదు…. ఒక మాజీ ఎమ్మెల్యే అవుట్ సోర్సింగ్ ఇవ్వమని అడిగితె పాపం పేదవాడు దళితుడు సరే అన్నాను ఒక గంటలో ఫోన్ చేసి ఆయనకు ఇవ్వద్దని అన్నావు … మంత్రులకు స్వేచ్ఛ ,వారిమీద విశ్వాసం లేకపోతె ప్రజలను పాలించే అర్హత నీకెక్కడిది….

మెజార్టీ ఉన్న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే ను కొనాల్సిన అవసరం ఉందా ?

రెండవసారి మంచి మెజార్టీ తో అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశావు అవసరం ఉందా ? ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుకదా ?…ఎమ్మెల్యే కు స్వేచ్ఛ ఇస్తే కోఠి చౌరస్తాను అమ్మేస్తారని అన్నావు ….ఇదా ఎమ్మెల్యేల పైన నీవు చూపించే గౌరవం …..

నేను బానిసను కాదు …ఉద్యమ సహచరుణ్ణి

వారసత్వం ఇచ్చుకుంటే ఇచ్చుకో కాని నేను మాత్రం బానిసను కాదు ….ఉద్యమ సహచరుణ్ణి ఆత్మగౌరవం ఉన్న బిడ్డను …. హుజురాబాద్ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. వారికీ మచ్చతెచ్చే పని ఏనాడూ చేయలేదు …. చేయబోను ….నాడు బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని అన్నావు …. కుష్ఠు రోగిని కౌగలించుకుంటాన్నావు ……. నేడు నీ ద్రోహ చరిత్ర తెలిసింది ….. అందరం ఒక్కటవుతాం అని అన్నారు . మీడియా సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి ,తుల ఉమా , గండ్ర నళిని , తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆఫ్ఘన్​ ప్రభుత్వ పగ్గాలు బరాదర్​ కే!

Drukpadam

దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు హిమాచల్ ఎన్నిక అద్దం పడుతుంది…భట్టి

Drukpadam

వచ్చే నెల 9న రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ: రేవంత్ రెడ్డి!

Drukpadam

Leave a Comment