కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో బీఆర్ యస్ ఎమ్మెల్యే
భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు బీఆర్ యస్ కు గుడ్ బై చెప్పినట్లే …
మహబూబాబాద్ పార్లమెంట్ ను అత్యధిక మెజార్టీతో గెలవాలి నియోజకవర్గ ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు …కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం ఇల్లందులో సన్నాహక సమావేశం జరిగింది …తుమ్మల ఆధ్వరంలో జరిగిన ఈసమావేశంలో బీఆర్ యస్ కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నడం ఆసక్తిగా మారింది …కొద్దీ కాలంగా తెల్లం పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది….ఆయన కూడా సీఎంను కలిశారు …భద్రాచలంలో సీఎం పాల్గొన్న సభలో తెల్లం చురుకుగా వ్యవరించారు …దీంతో నాటి నుంచే బీఆర్ యస్ పార్టీ తెల్లం పై ఆశలు వాదులు కుంది …ఆయన పార్టీ మారడంలేదని చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం లో పాల్గొని తాను మీ వాణ్ణి కాదని బీఆర్ యస్ కు ఇండికేషన్ ఇచ్చారు …
ఈ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు,ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు,డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ గారు,మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్ గారు,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, భద్రాద్రి కొత్తగూడెం డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య గారు తదితరులు పాల్గొన్నారు…