Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన హరీశ్ రావు

 

నేడు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు జన్మదినం
తన నియోజకవర్గంలో మొక్కలు నాటిన హరీశ్
కరోనా కారణంగా జన్మదిన వేడుకలు రద్దు

టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీశ్ రావు నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గం సిద్ధిపేటలో ఆయన మొక్కలు నాటారు. కరోనా నేపథ్యంలో, కార్యక్రమానికి ఆయన ఎవరినీ ఆహ్వానించలేదు. అతికొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ముగించారు.

మరోవైపు, హరీశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు. దీనికి సంబంధించి హరీశ్ కు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. దీనిపై నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా తాను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా ఎవరూ రావద్దని ఆయన కోరారు.

హైదరాబాదులో పలు ప్రాంతాల్లో వర్షం

గత రెండ్రోజులుగా హైదరాబాదులో వర్షాలు
చల్లబడిన నగరం
నేడు కూడా వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం
మరికొన్నిరోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు

వేసవి ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాదు నగరం గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో చల్లబడింది. ఇవాళ కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిక్కడపల్లి, చింతల్, రాంనగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, భోలక్ పూర్, కవాడిగూడ, విద్యానగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, హకీంపేట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురియడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

కాగా, మరికొన్నిరోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ చేరుకోనున్నాయి. ఈసారి అంచనాలకు తగినట్టుగానే వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళలో అత్యధిక భాగంలోనూ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో పాక్షికంగా విస్తరించాయి.

గచ్చిబౌలి టిమ్స్  కరోనా రోగులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

 

టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేటీఆర్
కరోనా రోగులతో మాటామంతీ
ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న వైనం
కరోనా వ్యాక్సినేషన్ అంశంలో కేంద్రంపై విమర్శలు

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగులను ఆయన పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి బెడ్ వద్దకు వెళ్లి కరోనా రోగులను పలకరించారు.

ఆసుపత్రి సందర్శన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఏడాది కాలంగా టిమ్స్ మెరుగైన సేవలు అందించిందని వెల్లడించారు.టిమ్స్ వైద్య సిబ్బంది కూడా ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. ఐటీ కంపెనీలు రూ.80 కోట్ల వ్యయంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాయని, సీఎస్ఆర్ కింద ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు. పలు సాఫ్ట్ వేర్ సంస్థలు రూ.15 కోట్లతో 150 ఐసీయూ బెడ్లను విరాళంగా అందించాయని, వాటిని టిమ్స్ లో అమర్చినట్టు తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని, లాక్ డౌన్ పూర్తయ్యేసరికి కరోనా వ్యాప్తి బాగా అదుపులోకి వస్తుందని వైద్యులు కూడా చెబుతున్నారని వివరించారు. ఇక, కరోనా వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ, కేంద్రం నిర్ణయాల వల్లే టీకాల ప్రక్రియ నిదానంగా సాగుతోందని విమర్శించారు. వ్యాక్సిన్ల అంశంలో కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తోందని కేటీఆర్ ఉద్ఘాటించారు.

 

ప్రతి ఒక్కరికి టీకా౼ మంత్రి పువ్వాడ.

 

 

◆ GHMC పరిధిలో ప్రత్యేక డ్రైన్. అనంతరం జిల్లాలకు విస్తరణ.

◆ రాష్ట్ర వ్యాప్తంగా 8.50 లక్షల మందికి టీకాలు ఇస్తాం.

◆ కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్స్‌కు (ఆటో, క్యాబ్‌, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్స్) వాక్సినేషన్.

◆ హైద్రాబాద్లోని ఉప్పల్ వాక్సినేషన్ కుంద్రాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తో కలిసి సందర్శించిన మంత్రి పువ్వాడ. కరోనా సమయంలోనూ కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు మ్యాక్సీ క్యాబ్స్, మినీ వ్యాన్స్, ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం GHMC పరిధిలో ప్రత్యేకంగా వాక్సినేషన్ ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ లోని జాన్సన్ గ్రామర్ స్కూల్ నందు వాక్సినేషన్ కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారితో కలిసి వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు..

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ..
సూపర్ స్ప్రెడర్స్‌ (Super spreders)కు వ్యాక్సినేషన్‌ (Vaccination)లో భాగంగా ఆటో, క్యాబ్‌, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు (Auto, cab drivers) టీకాలు ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల ప్రకారం నిత్యం వందలాది మందితో కలుస్తుండటం కారణంగా.. వైరస్‌ వ్యాప్తి కారకులు కాకూడదనే ఉద్దేశ్యంతో వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించడమైందన్నారు. విజయవంతంగా ఆయా టికాలను సూయర్ స్ప్రెడ్ ర్స్ పొందుతున్నారని అన్నారు. .కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ , ట్రాన్స్పోర్ట్ కమీషనర్ ఎంఆర్ఎం రావు గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ పాపారావు, ఆర్టీఓ రవీందర్, ఇతర అధికారులు సిబ్బంది ఉన్నారు..

 

ఎలక్ట్రిక్ బస్సులపై దృష్టి సారించిన ఏపీఎస్ఆర్టీసీ

 

 

350 ఎలక్ట్రికక్ బస్సులను కొనాలని నిర్ణయించిన ఆర్టీసీ
విశాఖకు 100 బస్సుల కేటాయింపు
ఇప్పటికే బిడ్లకు ఆహ్వానించిన ఆర్టీసీ

ఎలక్ట్రిక్ బస్సులను నడపాలంటూ ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. 350 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిడ్లను కూడా ఆహ్వానించింది. వీటిలో విశాఖకు 100 బస్సులు, తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్డు, కాకినాడ, అమరావతి, విజయవాడ నగరాలకు 50 బస్సుల చొప్పున కేటాయించింది. ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో బస్సుకు రూ. 55 లక్షల వంతున ప్రోత్సాహకం రూపంలో రానుంది. గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీ ధరలు తగ్గాయి. దీంతో నిర్వహణ వ్యయం కూడా సగం తగ్గుతుందని ఆర్టీసీ యాజమాన్యం చెపుతోంది. ఈ నెల 9లోగా ఈ బిడ్లను ఆర్టీసీ ఖరారు చేస్తుంది.

 

ధాన్యం దిగుమతులకు వెంటనే ఏర్పాటు చేయాలి

 

 

-పౌరసరఫరాల శాఖ కమిషనర్ తో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య

పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లాలలో ఉన్న ధాన్యం మిల్లర్లలో దిగుమతి చేసుకోవడానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హైదరాబాద్ నందు పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ (ఐఏఎస్) ని వారి కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గంలోని దాన్యం దిగుమతులకు నల్గొండ, కరీంనగర్ మిల్లర్లకు ఎలాట్ చేసినా కూడా మిల్లర్లు దిగుమతుల చేసుకోవడం లేదని దీని పై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతులకు పెద్దపల్లి మిల్లులకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. దాన్యం సరఫరా చేయుటకు లారీల కొరత లేకుండా లారీ అసోసియేషన్లతో, RTO లతో రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ గార్లతో సంప్రదింపులు జరిపి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంట పొలాల్లో ఉన్న దాన్యం నష్టం జరిగే ప్రమాదం ఉందని, తక్షణమే నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆయా మిల్లర్లకు అనుమతులు జారీ చేసి దిగుమతులు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు కోరారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లకు దిగుమతులకు మిల్లర్లతో మాట్లాడి ఏర్పాటు చేయాలని ఆదేశించింనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.

 

కరోనా సమయంలో ప్రజలను ఆదుకోండి :జిల్లా కలెక్టర్ కే కాంగ్రెస్ వినతి

 

 

కోవిడ్ టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లు ప్రజలను వెంటనే ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పోట్ల నాగేశ్వరరావు మద్ది శ్రీనివాస్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు వడ్డెబోయిన నరసింహారావు బాలగంగాధర్ తిలక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం : పోలీస్ కమిషనర్

 

 

 

జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో లాక్​డౌన్ పటిష్ఠంగానే అమలవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఏ కారణం లేకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. . అదేవిధంగా సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ తర్వాత కోర్టు ద్వారా వచ్చి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఇప్పటికే 2000 వేలకు పైగా వాహనాలు సీజ్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.

శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించిన పోలీస్ కమిషనర్ లాక్ డౌన్ ఆంక్షలు అమలు పరిశీలించారు. ఆనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ అనవసరమైన కదలికలను కట్టడి చేస్తూ…అత్యవసర సర్వీసులు సజావుగా కొనసాగేలా క్షేత్రస్ధాయిలో అధికారుల పర్యవేక్షణ వుండాలని దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, జిల్లాలో ఎక్కడ చూసిన విజబుల్ పోలీసింగ్ వుండాలని తద్వారా కాలక్షేపం కోసం బయటకు వచ్చే వారిని కట్టడి చేయవచ్చని సూచించారు.

అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి రోడ్లపై ఎవరూ బయటకు రాకుండా స్వచ్ఛందంగాస్వయనిర్భంధంలో వుంటూ పోలీసులకు సహకారించాలని ఈ సందర్భంగా సూచించారు.

 

పది రోజుల్లో ఈటల కనుమరుగు :ఎమ్మెల్సీ పల్లా జోస్యం! |

 

 

■ “మీరు మంత్రిగా చేసిన శాఖపై మీకు కనీస అవగాహన ఉందా?టీఆరెస్ పార్టీలో మీకు దక్కినన్ని పదవులు ఎవరికి దక్కలేదు. వచ్చే పది రోజుల్లో బీజేపీ లో మీరు కనుమరుగు అవుతారు.బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి చట్టవ్యతిరేకమైన దేవాదాయ భూములు,అసైన్డ్ భూములను ఈటెల రాజేందర్ ఎలా కొంటారు.మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సి , ఎస్టీ అధికారులను ఎలా ఇబ్బందులకు గురిచేసారో వారికే తెలుసు.ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదు.
ఈటెల రాజేందర్ కొనుమంటే కేసీఆర్ వద్దన్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు పాల్పడుతున్న బిజెపి లో చేరేముందు ఒకసారి ప్రశ్నించు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా తెలంగాణలో ప్రతి గింజను కొంటుంది సర్కార్.ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ప్రథకం కేసీఆర్ మదిలో నుండి పుట్టిందే.కరోన రివ్యూలో తాను లేకుండా సీఎం ఒక్కరే చేసారంటూ చేసిన ఆరోపణలు అవాస్తవం కదా.నిరంతరం ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తూ ఈటల కు ఇబ్బంది కాకుండా చూసారు.కులాల మధ్య కుంపట్లు పెట్టె ఆలోచన మానుకోవాలి”.

 

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను బివికె ఐసోలేషన్ కేంద్రానికి అందజేత

 

 

ఖమ్మం : కరోనా వైరస్ సోకి అనేకమంది ప్రజలు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు . ప్రభుత్వం హాస్పిటల్స్లో సరిపడ ఆక్సిజన్ సరఫరా కూడా ప్రభుత్వం సమకూర్చటంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది . కరోనా రోగులకు ఆక్సిజన్ అత్యవసరం అని భావించి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహాయ సహకారంతో 2 లక్షల రూపాయలు విలువ చేసే “ఆక్సెజన్ కాన్సెంట్రేటర్” ను చివికి మేనేజర్ వై. శ్రీనివాసరావుకు , సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అందజేశారు . అత్యవసర పరిస్థితిలోఆక్సిజన్ సేకరించి సహాయం అందించిన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్ర బాధ్యులకు మరియు పార్టీ జిల్లా నాయకులకు దీనికి బాధ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బషీర్ , బివికె రామారావు , వాసిరెడ్డి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

 

పేదలందరికీ వ్యాక్సిన్ వెంటనే ఇవ్వాలి …

 

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులకు పేద ప్రజలందరికీ కరోనా నివారణ వ్యాక్సిన్ ఇవ్వాలని కరుణ టెస్టులు పెంచాలని గ్రామ మండల స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా ప్రధాన వైద్యాధికారి మాలతికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరుణ మహమ్మారి తో వ్యవసాయ కార్మికులు పేదలు వైద్యం అందక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు చేయడంలో వ్యాక్సిన్ ఇవ్వడం లో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు అనేక దేశాలు తమ జనాభాకు రెండు రేట్లు 3 రేట్లు వ్యాక్సిన్లు ఆర్డరిచ్చి తెచ్చుకుంటే భారతదేశంలో 135 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం 18 కోట్లు చెప్పించడం వల్ల వ్యాక్సిన్ అందక అనేకమంది ప్రజలు కరోనా బారిన పడి చనిపోతున్నారని ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని ఆయన విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలంలో చనిపోయిన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు సంగయ్య పాల్గొన్నారు జిల్లా వైద్య ప్రధాన అధికారి వారి పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చార

 

ప్ర‌ధాన‌మంత్రికి జర్నలిస్ట్ రఘు లేఖ …

తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ మ‌రియు వేలకోట్ల దోపిడి గురించి.
తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. నిన్న ఉద‌యం నా ఇంటి స‌మీపంలో కొంద‌రు న‌న్ను కిడ్నాప్ చేశారు. ఐదు అంశాల గురించి వార్త‌ల ప్ర‌సారం ఆపితేనే నేను ప్రాణాల‌తో బ‌తుకుతాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత కిడ్నాప్ చేసిన‌వారు పోలీసుల‌ని తెలిసింది. సోష‌ల్ మీడియాలో నా కిడ్నాప్ అంశం వైర‌ల్ కావ‌డంతో న‌న్ను వారు కోర్టులో హాజ‌రుప‌రిచి జైలుకు పంపించారు. ప్ర‌స్తుతం నేను జైలు నుంచి మీకు ఈ లేఖ రాస్తున్నాను.

కిడ్నాప్ చేసిన పోలీసులు.. న‌న్ను వార్త‌లు ప్ర‌సారం చేయొద్ద‌ని కోరిన 5 అంశాలు
1. పుప్పాల‌గూడ కాందీశీకుల భూమి ఆక్ర‌మ‌ణ‌
2. ఐడీపీఎల్ 500 ఎక‌రాల ఆక్ర‌మ‌ణ‌
3. ఐకియా ముందు 43 ఎక‌రాల భూమి ఆక్ర‌మ‌ణ‌
4. ప్రాజెక్టుల దోపిడి
5. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో క‌రోనా ట్రీట్‌మెంట్ దోపిడి

  1. పుప్పాల‌గూడ‌లో 100 ఎక‌రాల కాందీశీకుల భూమి ప్ర‌స్తుతం ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతోంది. ఈ భూమి విలువ రూ.50 వేల కోట్లు. రైతుల‌ను బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూక‌బ్జా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు అధికార పార్టీ నేత‌లు, వారి బంధు మిత్రులు. చట్ట వ్యతిరేకంగా అక్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తిలిస్తున్నారు. నేను ఆ విష‌యం గురించి రిపోర్ట్ చేయ‌కూడ‌ద‌ట‌.

  2. ఐడీపీఎల్/ హిందుజ /గ‌ల్ప్ ఆయిల్‌కు చెందిన 500 ఎకరాల భూమిని మింగుతున్నారు ప్ర‌భుత్వ పెద్ద‌లు. దీని విలువ రూ.10 వేల కోట్లు. ఈ విష‌యం గురించి కూడా నేను మాట్లాడ‌కూడ‌ద‌ట‌

  3. హైటెక్ సిటీ స‌మీపంలో ఐకియాకు ముందు యూఎల్‌సీకి స‌రెండ‌ర్ చేసిన 35,36,47,53 స‌ర్వే నెంబ‌ర్ల భూమి ప్ర‌భుత్వం చేతిలో నుంచి ప్రైవేట్ చేతిలోకి ఎలా వ‌చ్చిందో ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ట‌.

  4. రాష్ట్రంలో మిష‌న్ భ‌గీరథ‌తో పాటు ప్రాజెక్టుల‌న్నింటిలో రూ.60 వేల కోట్ల అవినీతి జ‌రిగింది. ఆ డ‌బ్బంతా రాజ‌కీయ నాయ‌కుల‌కు చేరింది. ప‌క్క రాష్ట్రం క‌ర్నాట‌క‌తో పోలిస్తే అదే కాంట్రాక్టర్ చేసిన రేట్లతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టుల్లో విప‌రీత దోపిడి జ‌రిగింది. ఆ ప్రాజెక్టులు, టెండ‌ర్ల దోపిడి గురించి నేను మాట్లాడకూడ‌ద‌ట‌.

  5. క‌రోనా స‌మ‌యంలో విప‌రీత‌మైన దోపిడికి తెగ‌బ‌డి శ‌వాల‌తో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై క‌థ‌నాల‌ను త‌క్ష‌ణం ఆపివేయాల‌ట‌.

ప్ర‌ధానమంత్రిగా మిమ్మ‌ల్ని ఈ అంశాల‌పై దృష్టి సారించాల‌ని కోరుతున్నాను. క‌నీస పౌర‌హ‌క్కులు, ప‌త్రికా స్వేచ్ఛ‌లేని తెలంగాణ ప‌రిస్థితిని మీరు మారుస్తార‌ని ఆశిస్తున్నాను. నా ప్రాణాలకు భద్రత లేదు, నాకు రక్షణ కలిపించాలని కోరారు .

 

కరోనా సమయంలో జర్నలిస్ట్ లకు చేయూత…..

 

 

ఇల్లందు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లకు చేయూత. నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శోభన్ బాబు, సీనియర్ జర్నలిస్ట్ లు నాగేశ్వరరావు, గడ్డం వెంకటేశ్వర్లు, శ్రావణ రెడ్డి,వీర మోహన్, సుమంత్, నర్సి, వేణుగోపాల్, g. శ్రీనివాస్, రమణ, డానియల్, కృష్ణ ఉమా, సంపత్ తదితరులు ఉన్నారు.

 

లింగాల రవి కుమార్ ఒకరోజ దీక్ష

.

కరోనాతో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవి కుమార్ తన జన్మదిన సందర్భంగా నేడు ఒకరోజ దీక్ష ను చేపట్టారు ఖమ్మం పట్టణంలో తన నివాసంలో కరోనా మృతులకు సంఘీభావంగా చేపట్టిన దీక్ష సందర్భంగా లింగాల రవికుమార్ మాట్లాడుతూ కరోనాతో అనేకమంది ప్రజలు మరణిస్తున్నారని అనేకమంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వీరందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కరోనా వ్యాక్సిన్ ఆన్ లైన్ తో సంబంధం లేకుండా పల్స్ పోలియో మాదిరిగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకోవాలని కోరారు

 

 

Related posts

అమరావతి రాజధాని కేసు జులై 11 వాయిదా…!

Drukpadam

దేశంలో తొలి ఓటరు.. 106 ఏళ్ల వయసులో ఓటు హక్కు వినియోగం!

Drukpadam

అమెరికాలో మళ్లీ కాల్పులు..నలుగురి మృతి…

Drukpadam

Leave a Comment