Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బ్రెజిల్ అధ్యక్షుడిపై ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం.. మాట్లాడుతుంటే గిన్నెలతో శబ్దాలు!

  • కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధ్యక్షుడు
  • కరోనాను చిన్న ఫ్లూగా కొట్టిపడేసిన బొల్సొనారో
  • ఆయన ప్రసంగం వేళ గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసనలు

కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి సర్వత్ర విమర్శలు ఎదుర్కొన్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సెనారోపై సొంత దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా మహమ్మారి వెలుగు చూసిన మొదట్లో బొల్సొనారో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి.

అది చిన్న ఫ్లూ మాత్రమేనని మొదట్లో ఆయన చాలా తేలికగా కొట్టిపడేశారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి పెరిగింది. ఒక దశలో రోజుకు నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించాయి. నిన్న కూడా లక్ష కేసులు, రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

బుధవారం సాయంత్రం టెలివిజన్‌లో బొల్సొనారో ప్రసంగిస్తున్న వేళ ప్రజలు గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. బొల్సొనారో మాట్లాడుతూ.. ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. ఆర్థిక వృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగానే ప్రజలు గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు.

కాగా, శనివారం కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు దిగారు. 16 నగరాల్లోని వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొన్నాయి. అధ్యక్షుడిని రక్త పిశాచిగా పేర్కొంటూ సావోపాలో బెలూన్లు ప్రదర్శించారు.

Related posts

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసిఆర్ ఆదేశం

Drukpadam

భానుడి భగభగలు …నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

Drukpadam

ప్రపంచంలోనే అత్యధికకాలం 22 సంవత్సరాలు జీవించిన శునకం మృతి!

Drukpadam

Leave a Comment