ఖమ్మం వార్తలు

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!

నిరంతరం ప్రజా సేవ చేస్తామని, అన్నా అంటే అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి లోని ప్రధాన సెంటర్ లో కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలం లోనే ఆరు గ్యారెంటీ ల్లో ఐదు అమలు చేస్తోన్నదని అన్నారు. త్వరలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారు. పదేళ్లు పాలించి ప్రజా సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్, మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీనీ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు డ్రామాలడుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు.

నేను మీ వాడినని… చేగొమ్మ స్వగ్రామం అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఎంపీగా జిల్లా ప్రజలకు మంచి సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

నాకు ఎవరితో విభేదాలు లేవు – ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

Ram Narayana

కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ సీటు పంచాయతీ …

Ram Narayana

నాగెలుపులో ప్రధానపాత్ర వహించి 50 వేల మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శాల్యూట్ ..! మంత్రి తుమ్మల

Ram Narayana