కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలి:తెలంగాణ వ్యాపితంగా కాంగ్రెస్ దీక్షలు
గాంధీభవన్ లో ముఖ్య నేతల దీక్ష
రాష్ట్రంలో పేద ప్రజలకు కరోనా చికిత్సను ఉచితంగా అందించాలి
కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఉత్తమ్
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలకు దిగారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు దీక్షలో పాల్గొన్నారు. కరోనా వేళ రాష్ట్ర సర్కారు తీరుకి నిరసనగా వారు ఈ దీక్షలు చేస్తున్నారు.
రాష్ట్రంలో పేద ప్రజలకు కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు.. దీక్ష ప్రారంభించిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీభవన్‌తో పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లో ఈ దీక్షలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
కరోనా చికిత్స కోసం పేదలు తమకున్న కొద్దిపాటి ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాల్సిందేనని చెప్పారు. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం లో కాంగ్రెస్ నేతల దీక్ష …..
తెల్ల రేషన్ కార్డు కుటుంబాల అన్నిటికీ కరోనా మరియు బ్లాక్ ఫంగస్ చికిత్స ఉచితంగా ప్రభుత్వం చెయ్యాలని ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జావిద్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డెబోయిన నరసింహారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దర్జీ చెన్నారావు, ఖమ్మం జిల్లా బీసీ సెల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పుచ్చకాయల వీరభద్రం, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య , జిల్లా కాంగ్రెస్ నాయకులు చోటు బాబా , పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు రామసాయం మాధవరెడ్డి ,కార్పొరేటర్లు మలేదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, కంజర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పుబ్బ చంద్రిక, కొప్పెర ఉపేందర్, పల్లబోయిన చంద్రం, వాహబ్, అబ్బాస్, పెద్ది హైగ్రీవ , పాలేరు నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు , ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రీపోతుల అంజని, నల్లమోతు లక్ష్మయ్య, ఎడవెల్లి పుల్లారెడ్డి, బండ్ల వెంకటరెడ్డి , దసరా వెంకన్న, ఎడవెల్లి రామరెడ్డి, మద్ది వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు