- డ్రోన్ వ్యూ వీడియోను విడుదల చేసిన చైనీస్ సంస్థ
- డ్రోన్ సహాయంతో అద్బుత వీడియోను తీసిన డీజేఐ గ్లోబల్
- శిఖరం ఎక్కుతూ కనిపించిన ట్రెక్కర్స్
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం చూడాలని ఎవరికి ఉండదు? కానీ అక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేకనో… ఆర్థిక స్తోమత లేకనో… వీలు దొరకకనో… ఇలా మరేదైన కారణంతోనో దానిని దగ్గరి నుంచి చూసే అవకాశం ఎంతోమందికి ఉండదు. అలాంటి వారి కోరికను తీర్చడానికి చైనాకు చెందిన ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ డీజేఐ గ్లోబల్… డ్రోన్ సహాయంతో అద్భుతమైన వీడియోను తీసింది.
సముద్రమట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ నుంచి డ్రోన్‌ను ప్రయోగించారు. అక్కడి నుంచి శిఖరాగ్రం వరకు ఈ డ్రోన్ వరుసగా వీడియోను తీస్తూ కదిలింది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్న వారు… దిగుతున్న వారు కూడా ఈ వీడియోలో కనిపించారు. వీడియోలో హిమనీ నదాలు, తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ ప్రకృతి అందాలు అందర్నీ అబ్బురపరుస్తాయి.