Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

 ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఆడి కారును సీజ్ చేసిన పోలీసులు

  • వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌గా ముద్రపడిన పూజా ఖేద్కర్
  • మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించిన వైనం
  • కారుపై బీకాన్ ఏర్పాటు, ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అని స్టిక్కర్
  • కారుపై 21 ట్రాఫిక్ చలాన్లు.. రూ. 26 వేల జరిమానా

అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌గా వార్తల్లోకి ఎక్కిన పూజా ఖేద్కర్ లగ్జరీ ఆడి కారును పూణె ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించి తన ప్రైవేటు కారుపై వీఐపీ నంబర్ ప్లేట్, కారుపై రెడ్, బ్లూకలర్ బీకన్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు ప్రభుత్వ అనుమతి లేకుండానే వాహనంపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అని రాసుకోవడంతో పోలీసులు ఆమె కారును సీజ్ చేశారు.

21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ. 26 వేల జరిమానా కూడా విధించారు. ట్రాఫిక్ విభాగం నోటీసులు జారీచేయడంతో శనివారం రాత్రి ఖేద్కర్ కుటుంబ డ్రైవర్ కారు తాళాలు తీసుకెళ్లి చతుష్రింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. కారుకు సంబంధించిన పత్రాలు ఇంకా తమకు అందలేని పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల పూజ ఖేద్కర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, దురుసు ప్రవర్తన, యూపీఎస్‌సీ ఎంపికలో అక్రమాలకు పాల్పడడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Related posts

తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్

Ram Narayana

ఐ యమ్ ఏ క్లిన్ మెన్ …వ్యాపారంలో నిబంధలను ఉల్లగించలేదు : మంత్రి గంగుల!

Drukpadam

అమెరికాలో హైటెక్ మోసం.. కేవలం 12 సెకన్లలో 200 కోట్లు కొట్టేసిన స్టూడెంట్లు…

Ram Narayana

Leave a Comment