Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

కేంద్రంలో నిర్మలమ్మ పద్దు ..అభివృద్ధికి బాటలు ..మోడీ విజన్ కు తార్కాణం అన్న ఆర్ధికమంత్రి

తొమ్మిది రంగాల్లో నాలుగింటికి పెద్దపీట.. భవిష్యత్తు బడ్జెట్‌లకు ఇది రహదారి: నిర్మలా సీతారామన్

  • వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • మోదీ 3.0 ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించిన ఆర్థిక మంత్రి
  • వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే పథకాలు
  • వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్ల కేటాయింపు
  • ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ రూ.48.21 లక్షల కోట్లు ఉంది …కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను లోకసభలో ప్రవేశ పెట్టారు …ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బడ్జెట్ దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుంది అన్నారు …ఎంతో ముందు చూపుతో దీన్ని ప్రవేశపెట్టామని ప్రధాని మోడీ ఆశలకు ,ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు …అయితే విపక్షాలు మాత్రం ఈ బడ్జెట్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి…ఇది కేవలం మాటల గారడీలు ఉందని ఆరోపిస్తున్నాయి…ప్రభుత్వానికి సమకూరే మొత్తం ఆదాయం (అంచనా) రూ.32.07 లక్షల కోట్లుకాగా ఇందులో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు అని ,అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా వేశారు …ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చునని పేర్కొన్నారు ..

కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటనలు …

దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం
ఆంధ్రప్రదేశ్‌, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు
స్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖల ఏర్పాటు
ఏటా లక్ష మంది విద్యార్థులకు ఇ-వోచర్ల ద్వారా మొత్తం రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ
గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి
రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం
రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం

తొమ్మిది రంగాల్లో నాలుగింటికి పెద్దపీట.. భవిష్యత్తు బడ్జెట్‌లకు ఇది రహదారి: నిర్మలా సీతారామన్

వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
మోదీ 3.0 ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించిన ఆర్థిక మంత్రి
వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే పథకాలు
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్ల కేటాయింపు
ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు వరుసగా ఏడోసారి 2024 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తు బడ్జెట్‌లకు ఇది మార్గనిర్దేశనం చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వ 9 ప్రాధామ్యాలను ఆమె హైలైట్ చేశారు.

ఈ తొమ్మిదింటిలో వ్యవసాయంలో ఉత్పాదకత, స్థితి స్థాపకత, ఉపాధి, నైపుణ్యం, మెరుగైన మానవ వనరులు, సామాజిక న్యాయం, తయారీ-సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తర్వాతి తరం సంస్కరణలు ఉన్నాయి. భవిష్యత్ బడ్జెట్‌లు కూడా ఈ బడ్జెట్‌లోని ప్రాధామ్యాలపై ఆధారపడి ఉంటాయని నిర్మల తెలిపారు.

పైన పేర్కొన్న తొమ్మిదింటిలో ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్) మధ్యతరగతి అనే నాలుగు ప్రాథమిక రంగాలపై ఈ బడ్జెట్ దృష్టి సారిస్తుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లతో 4.1 కోట్లమంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని చెప్పారు. అలాగే విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించనున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాతీయ సహకార రంగాన్ని రూపొందించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమలును సులభతరం చేస్తారు. అలాగే, ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభిస్తారు. రైతులకు సాయం చేసేందుకు 10 వేల అవసరాల ఆధారిత బయో ఇన్‌పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వందకుపైగా అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల 32 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల వంగడాలు విడుదల చేస్తారు.

కేంద్ర బడ్జెట్: 500 పెద్ద కంపెనీలలో ఇంటర్న్ షిప్ అవకాశాల కల్పన

పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం
వంద నగరాల్లో పారిశ్రామిక పార్కులు
ఇండస్ట్రియల్ ఏరియాల్లో కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. 500 పెద్ద కంపెనీలలో ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పిస్తామని, పారిశ్రామిక వాడల్లో కార్మికుల సౌకర్యం కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని నిర్మల తెలిపారు. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట

అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న మంత్రి
రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు ప్రకటించారు. అంతేకాదు, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈమేరకు లోక్ సభలో మంత్రి నిర్మల మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లను ప్రత్యేక సాయంగా అందిస్తామని చెప్పారు.

దీంతో పాటు అమరావతి అభివృద్ధికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. ఇక, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించామని వివరించారు.

స్టాంప్ డ్యూటీపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం

పన్ను పెంచుకునేందుకు మార్గం సుగమం చేసిన కేంద్రం
మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు
ఎన్ పీఎస్ పథకంలో మైనర్లూ చేరేలా మార్పులు
స్టాంప్ డ్యూటీపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అదేసమయంలో మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇక ఎన్‌పీఎస్‌ పథకంలో మార్పులు చేస్తూ మైనర్లు కూడా చేరేందుకు వీలు కల్పించారు. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లను కేంద్రం ఈ బడ్జెట్ లో కేటాయించింది. ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో వెల్లడించారు.

Related posts

బీజేపీకి మిత్రపక్షం షాక్.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు!

Ram Narayana

పాత పార్లమెంటు భవనానికి కొత్త పేరును ప్రతిపాదించిన ప్రధాని మోదీ

Ram Narayana

డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు… మహువా మోయిత్రాపై ఆరోపణల మీద తృణమూల్ మౌనం

Ram Narayana

Leave a Comment