Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన మమతా బెనర్జీ

మాట్లాడుతుంటే మైక్ ఆపేశారు… మమతా

  • నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం
  • ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక భేటీ
  • తనను ఐదు నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదన్న మమతా బెనర్జీ
  • మైక్ కట్ చేయడాన్ని అవమానంగా భావించి బయటికొచ్చేశానని వెల్లడి

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో తాను మాట్లాడుతుంటే, తన ప్రసంగం మధ్యలో మైక్ ఆపేశారని, అందుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశానని మమత వెల్లడించారు. కనీసం తనను ఐదు నిమిషాలు కూడా మాట్లాడేందుకు అనుమతించలేదని, తాను మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడాన్ని అవమానంగా భావించానని తెలిపారు. 

ఇవాళ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎంలలో మమతా బెనర్జీ ఒక్కరే ఎన్డీయేతర ముఖ్యమంత్రి. మిగతా అందరూ ఎన్టీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు. 

Related posts

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్ లాల్!

Ram Narayana

నాది నైతిక రాజీనామా… ఇప్పుడు షిండే, ఫడ్నవీస్ రాజీనామా చేయాలి: ఉద్దవ్ థాకరే…

Drukpadam

రాహుల్ గాంధీకి పెళ్లైందని బంగ్లాదేశ్ బ్లిట్జ్‌ లో వచ్చింది… ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి?: రఘునందన్

Ram Narayana

Leave a Comment