Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.. ప్రపంచంలోనే హైస్పీడ్​ ఇంటర్నెట్​!

  • ఏకంగా సెకనుకు 402 టెరాబిట్ల డేటా ట్రాన్స్ ఫర్
  • కొత్త సాంకేతికతను రూపొందించిన ఆస్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు
  • ఇప్పుడున్న ఫైబర్ ఆఫ్టిక్ కేబుళ్లతోనే డేటా ప్రసారం

మీరు వాడే నెట్ స్పీడ్ ఎంత? మొబైల్ లో అయితే 4జీ, 5జీతో 100 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. ఇంట్లో పెట్టుకునే బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఒక జీబీపీఎస్ వరకు ఉంటుంది. కానీ ఏకంగా 400 టీబీలకుపైగా ఇంటర్నెట్ స్పీడ్ తెలుసా? అంటే సెకనుకు 4 లక్షల జీబీపీఎస్ స్పీడ్ అన్నమాట. యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంత స్పీడ్ ఇంటర్నెట్ ను సాధించగలిగారు.

వేర్వేరు వేవ్ లెంత్ లను వినియోగించి..
సాధారణంగా ఫైబర్ ఆఫ్టిక్ కేబుళ్లలో నిర్ణీత వేవ్ లెంత్ ఉన్న కాంతిని ఉపయోగించి సమాచారాన్ని ప్రసారం చేస్తారు. కాంతి ద్వారానే డేటా ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే ఒకే వేవ్ లెంత్ ఉన్న కాంతిని మాత్రమేకాకుండా.. వేర్వేరు వేవ్ లెంత్ లు ఉన్న కాంతిని ఒకే సమయంలో ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు హైస్పీడ్ ఇంటర్నెట్ ను సాధించగలిగారు.

  • ఈ టెక్నాలజీకి జపాన్ శాస్త్రవేత్తలు అనుసరించిన విధానమే మూలం. కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు కొన్ని నెలల కింద ఏకంగా 301 టీబీపీఎస్ స్పీడ్ తో డేటాను ప్రసారం చేయగలిగారు.
  • ఇప్పుడు అదే తరహా టెక్నాలజీని మరింత మెరుగుపర్చి ఏకంగా 402 టీబీపీఎస్ స్పీడ్ సాధించినట్టు ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు.

ఇప్పుడున్న కేబుల్స్ తోనే ఆ స్థాయి స్పీడ్..
ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే 402 టీబీపీఎస్ వేగం సాధించగలిగారు. అంటే కొత్తగా కేబుళ్లను మార్చాల్సిన అవసరం ఉండదు. కేవలం డేటాను ప్రసారం చేసే చోట, రిసీవ్ చేసుకునే చోట చిన్నపాటి పరికరాలు, యాంఫ్లిఫయర్లను వాడితే చాలని శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

Related posts

బంగ్లాదేశ్ ప్రధానిగా ఐదోసారి పగ్గాలు చేబట్టనున్న షేక్ హసీనా

Ram Narayana

దావూద్ ఇబ్రహీం చచ్చిపోయాడా?.. ఛోటా షకీల్ ఏం చెప్పాడంటే!

Ram Narayana

ప్రాణభయంతో ఇరాన్ పారిపోయిన హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిమ్…

Ram Narayana

Leave a Comment