Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

డెల్టా వేరియంట్‌తో జాగ్రత్త.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

డెల్టా వేరియంట్‌తో జాగ్రత్త.. ఐరోపా దేశాలను హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
-కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలు సడలిస్తున్న ఐరోపా దేశాలు
-తొందరపాటు వద్దని హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ
-నిర్లక్ష్యంగా ఉంటే డెల్టా వేరియంట్ రెచ్చిపోతుందని హెచ్చరిక
కరోనా తగ్గుముఖం పడుతుందని సంతోష పడుతున్నవేళ డెల్టా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది భారత్లో ఇప్పటికే గుర్తించటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డేంజర్ బెల్స్ మోగించింది.
కరోనా తగ్గుముఖం పడుతున్నదని పలు దేశాలు ఆంక్షలు సడలిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా దేశాలకు హెచ్చరికలకు ప్రాధాన్యత సంతరించుకున్నది . భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండకపోతే డెల్టా వేరియంట్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ వేరియంట్‌ కొన్ని వ్యాక్సిన్లను తప్పుదారి పట్టించే అవకాశం కూడా ఉందని, మరీ ముఖ్యంగా ఈ వేరియంట్ వల్ల 60 ఏళ్లు దాటిన వారికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, సామూహిక సమావేశాలు, ప్రయాణాలకు అనుమతుల విషయంలో జాగురూకత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా డైరెక్టర్ హన్స్‌క్లూగ్ తెలిపారు.

Related posts

భౌతిక దూరం పద్ధతికి దక్షిణాఫ్రికా స్వస్తి…

Drukpadam

తెలంగాణాలో కరీంనగర్ ,ఖమ్మం వరంగల్ జిల్లాలో పాజిటివ్ కేసులు అధికం: హెల్త్ డైరెక్టర్!

Drukpadam

దేశంలో రెండో ఒమిక్రాన్ మరణం నమోదు…

Drukpadam

Leave a Comment