Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పాలేరు నియోజకవర్గాల్లో విద్యార్థులకు సొంత నిధులతో సైకిళ్ళు …మంత్రి పొంగులేటి

పాలేరు నియోజకవర్గంలో దూరప్రాంతాల కాలినడకన వెళ్లి చదువుకునే విద్యార్థులకు సొంతనిధులతో సైకిళ్ళు కొని ఇస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు …ఆదివారం కూసుమంచి లోని క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాళ్లు, మండల విద్యాధికారులు, ఆర్సీవోలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాపరంగా రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో నిలపాలని అన్నారు …అందుకు ఉపాద్యాలు చిత్తశుద్ధితో కృషి చేయాలనీ అన్నారు …పాఠశాలల్లో ఉన్న సమస్యలు తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని తెలిపారు ..

అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తిచేశారన్నారు. రోజువారి విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరుపై పర్యవేక్షణ చేయాలన్నారు. యూనిఫామ్, పాఠ్య, నోట్ పుస్తకాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లో బోధన జరిగేలా చూడాలని, ఇందుకు ఉపాధ్యాయులకు ప్రణాళికాబద్ద శిక్షణ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా చేయగలిగేది చేస్తామని, వ్యక్తిగతంగాను విద్యాపరంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి అన్నారు. అన్ని పాఠశాలల్లో క్రీడల కార్యకలాపాలు చేపట్టాలని, క్రీడలతో పిల్లలు, ఉపాధ్యాయుల ఆరోగ్యంగా ఉండొచ్చని అన్నారు. కనీస మౌళిక సదుపాయాలపరంగా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 2 కి.మీ. లకు పైగా దూరం నుండి పాఠశాలలకు వచ్చే విద్యార్థినులు నియోజకవర్గంలో సుమారు 604 మంది ఉన్నట్లు, వారందరికీ స్వంత నిధులతో సైకిళ్లను సెప్టెంబర్ 5లోగా అందించనున్నట్లు ఆయన అన్నారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు అమకూర్చనున్నట్లు, ఇదివరకే ఉన్న ఆర్వో ప్లాంట్లు మరమ్మత్తులు చేయించి వాడుకలోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలల్లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్నట్లు, దీనిని ఉక్కుపాదంతో నియంత్రించాలని అన్నారు. ఉపాధ్యాయులు డ్రగ్స్ విషయంలో ఏ విద్యార్థిపైనా అనుమానం ఉన్న, అతని చర్యలు గమనించి, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, పిల్లల్లో డ్రగ్స్ నియంత్రణ ఉపాధ్యాయులతోనే ఎక్కువ సాధ్యపడుతుందని ఆయన అన్నారు. విద్య, వైద్య పరంగా పేదరికంతో ఇబ్బందులు పడేవారు దృష్టికి వస్తే సమాచారం ఇవ్వాలని, వారికి అండగా నిలుస్తానని మంత్రి తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి, అందులో జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్, ఏసీపీ, అధికారులను చేర్చి, ఎటువంటి సమస్యలు, విషయాలు తెలుపాలన్న గ్రూప్ లో పోస్ట్ చేయాలని, ప్రతి సమస్య తీర్చడానికి కృషి చేయనున్నట్లు ఆయన అన్నారు. ప్రధానోపాధ్యాయులు తెలిపిన సమస్యలకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. పాఠశాలల్లో నమోదులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక మంచి అభిప్రాయం, నమ్మకం ప్రభుత్వ పాఠశాలలపై కల్పించాలని, ఈ దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి అన్నారు.
ఈ సమీక్ష లో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, ఖమ్మం ఆర్డీవో గణేష్, ఆర్సీవోలు, మండల విద్యాధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీతారామ ప్రాజెక్టు కేసీఆర్‌ మానసపుత్రిక …బీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు…

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల కృతజ్ఞత లేఖ..యధాతధంగా…

Ram Narayana

వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలి. కూనంనేని

Ram Narayana

Leave a Comment