Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఎక్స్ కు రూ.5 కోట్ల జరిమానా… ఐర్లాండ్ లో ఇంత పెద్ద జరిమానా ఇదే మొదటిసారి!

  • ఎక్స్ (ట్విట్టర్) కు షాక్ ఇచ్చిన ఐర్లాండ్ వర్క్ ప్లేస్ కమిషన్ (డబ్ల్యూఆర్సీ)
  • ఉద్యోగిని ఆకస్మికంగా తొలగించినందుకు రూ.5 కోట్ల జరిమానా
  • ఉద్యోగుల తొలగింపునకు ఎక్స్ ఈ మెయిల్ షరతులను తప్పు బట్టిన కమిషన్

సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ కు ఐర్లాండ్ వర్క్ ప్లేస్ కమిషన్ (డబ్ల్యూఆర్సీ) భారీ షాక్ ఇచ్చింది. తొలగించిన ఓ ఉద్యోగికి భారీగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఉద్యోగికి పరిహారంగా 6,02,640 డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.5 కోట్లు జరిమానా విధించి దానిని ఉద్యోగికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాలని తీర్పు ఇవ్వడం ఐర్లాండ్ లో ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఆ వివరాలలోకి వస్తే .. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ .. ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అందులో అనేక మార్పులు, చేర్పులు చేశారు. ఆ క్రమంలో భాగంగా ట్విట్టర్ ను మెరుగుపరిచేందుకు ఉద్యోగులు అంకితభావం, సుదీర్ఘ పని గంటలకు కట్టుబడి ఉండాలని మస్క్ సూచించారు. ఇందుకు గానూ ఈ మెయిల్ చివరిలో అవును, కాదు అనే ఆప్షన్ లు ఇచ్చి అభిప్రాయాలను తెలపాలని కోరారు. దీనికి ఎటువంటి సమాధానం ఇవ్వకపోతే ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామంటూ షరతు విధించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు గానూ మూడు నెలల సమయం కూడా ఇచ్చారు.

అయితే 2013 నుండి డబ్లిన్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న గ్యారీ రూనీ ఈ మెయిల్ కు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. దీంతో కారణాలు తెలపకుండానే అతన్ని స్వచ్చందంగా ఉద్యోగం నుండి తొలగించారు. దీంతో అతను డబ్ల్యూఆర్సీని ఆశ్రయించారు. కమిషన్ దీనిపై విచారణ జరిపి తాజాగా తీర్పును వెల్లడించింది. ఈమెయిల్ లో అవును అని క్లిక్ చేయకపోవడాన్ని రాజీనామాగా పరిగణించలేమని న్యాయాధికారి మైఖెల్ మాక్ నామీ పేర్కొన్నారు. రూనీ ఆకస్మిక తొలగింపుతో ఆర్ధికంగా, వృత్తి పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులకు పరిహారంగా అతనికి రూ.5 కోట్లు చెల్లించాలని తీర్పులో కమిషన్ పేర్కొంది. ఈ తీర్పుపై ఎలాన్ మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts

నిజ్జర్ హత్య కేసు నిందితుల అరెస్టుపై తొలిసారి స్పందించిన కెనడా ప్రధాని…

Ram Narayana

రూ. 1600 కోట్లు జీతం.. నెట్టింట విమర్శ‌లు.. కంపెనీ సీఈఓ వివ‌ర‌ణ ఇదీ!

Ram Narayana

నేపాల్ లో లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు భారతీయులు సహా ఏడుగురి మృతి

Ram Narayana

Leave a Comment