Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రఘురామరాజును అనర్హుడిగా ప్రకటించండి వైసీపీ…

రఘురామరాజును అనర్హుడిగా ప్రకటించండి వైసీపీ
-లోక్ సభ స్పీకర్ ను కోరిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్
-రఘురామపై వైసీపీలో తీవ్ర ఆగ్రహావేశాలు
-ఓం బిర్లాతో సమావేశమైన ఎంపీ మార్గాని భరత్
-రఘురామ అంశంపై చర్చ
-పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అతిక్రమించినట్టు ఆరోపణ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై గుర్రుగా ఉన్న వైసీపీ ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైసీపీ ఎంపీ, లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇవాళ ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామకృష్ణరాజు అంశాన్ని చర్చించారు.

రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనపై అనర్హత వేటు వేయాలని భరత్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ అనుసరించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని ఆరోపించారు.

రఘురామ వైసీపీ గుర్తుపై నరసాపురం లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. రఘురామ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను తాము గతంలోనే లోక్ సభలో అందించామని భరత్ స్పీకర్ కు వివరించారు. రఘరామ విషయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేయడంతో పాటు ,ఆయన లోక సభ సభ్యత్వాన్ని రద్దుచేయాలని కోరింది. ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో మరోసారి ఆపార్టీకి చెందిన విప్ మరగని భరత్ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Related posts

ఢిల్లీలో ముగిసిన మౌనదీక్ష.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

Drukpadam

పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు: పేర్ని నాని!

Drukpadam

బీఆర్ఎస్ లో చేరుతానని గతంలో బండి సంజయ్ నాతో చెప్పారు: రవీందర్ సింగ్…!

Drukpadam

Leave a Comment