Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేంద్రం పొదుపు మంత్రం … ఖర్చులు తగ్గించుకోండి

కేంద్రం పొదుపు మంత్రం … ఖర్చులు తగ్గించుకోండి
పొదుపు పాటించండి.. ప్రభుత్వ విభాగాలకు కేంద్రం ఆదేశాలు!
20శాతం ఖర్చులు తగ్గించుకోవాలని సూచన
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత తొలిసారి
వ్యయ నియంత్రణలో భాగంగానే నిర్ణయం
కొవిడ్‌ నేపథ్యంలో పూర్తి సామర్థ్యంతో పనిచేయని వ్యవస్థలు
ఇదే సరైన తరుణమని కేంద్రం భావన

 

కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థతో రాబడి తగ్గటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పొదుపు మంత్రం పాటించాలని వివిధ మంత్రిత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అన్ని శాఖలు ఖర్చులను తగ్గించుకోవాలని కోరింది….

అదనపు పనిగంటలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, రివార్డుల వంటి వ్యయాలను 20 శాతం మేర తగ్గించుకోవాలని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు కేంద్రం లేఖ రాసింది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ విధంగా వ్యయ నియంత్రణ పాటించాలంటూ ఆదేశించడం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌పెండీచర్‌ విభాగం అన్ని ప్రభుత్వ శాఖ కార్యదర్శులు సహా సంబంధిత యంత్రాంగాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికలో లేని, అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అందుకు 2019-20ని బేస్ ఇయర్‌గా తీసుకోవాలని సూచించింది.

అయితే, కొవిడ్‌ మహమ్మారి కట్టడికోసం కేటాయించిన నిధులకు మాత్రం వ్యయ నియంత్రణ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో వ్యవస్థలేవీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని వ్యయ నియంత్రణకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడింది.

Related posts

మార్నింగ్ వాక్‌ చేస్తున్న అసోం డీఐజీ ఫోన్ చోరీ!

Ram Narayana

Why You Should Pound Chicken Breasts Before Cooking Them

Drukpadam

బీహార్ ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల భారీ జరిమానా…!

Drukpadam

Leave a Comment