వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలి. కూనంనేని
కేంద్రం రూ.10వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలి
అశాస్త్రీయంగా నష్టం అంచనా పరిహారం పెంపుదల చేయాలి
కలెక్టరేట్ వద్ద ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని
తెలంగాణలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఓదార్పు మాటలకు కేంద్రం పరిమితం కాకుండా తక్షణ సాయంగా రూ.10వేల కోట్లను ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించి తక్షణం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరదల సాయం పెంపుదల చేయాలని, జాతీయ విపత్తుగా గుర్తించాలని సిపిఐ -ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన -సాంబశివరావు మాట్లాడుతూ కనీవినీ ఎరుగని రీతిలో ఆగస్టు 30, 31 తేదీలలో రికార్డు స్థాయిలో వర్షం కురిసిందని దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నష్టం -వాటిల్లిందన్నారు. మున్నేరు. ఆకేరు పరివాహక ప్రాంతంలోని నివాస గృహాలు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయన్నారు. ఆకస్మాత్తుగా -వరదలు రావడంతో కట్టు బట్టలతో ప్రజలు బయటపడ్డారని సాంబశివరావు తెలిపారు. నది పరివాహక ప్రాంతాల్లో భూములు సాగుకు పనికి రాకుండాపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ -వరదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. వరదలు సంభవించినప్పుడు నష్టం అంచనా -అశాస్త్రీయంగా ఉందని నష్టపోయిన ప్రజలకు కనీస ఊరట కలిగించే రీతిలో పరిహారం లేదన్నారు. ఎకరం పంట నష్టం జరిగితే రూ.10వేలు ప్రకటించిన ప్రభుత్వం అసలు సాగుకు పనికిరాకుండాపోయిన భూములకు రూ.10వేలు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. -ఎకర పంటకే ఇప్పటికీ రూ. 25వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేశారని రూ. 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. పెట్టుబడి ఆధారంగా పరిహారం ప్రకటించాలని ఇంట్లో వస్తువులు, జరిగిన నష్టాన్ని బట్టి పరిహారం ఇవ్వాలని పూర్తిగా దెబ్బతిన్న ఇండ్ల స్థానంలోనే ఇందిరమ్మ ఇండ్లను, ముంపుకు గురికాని ప్రాంతాలలో కేటాయించాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. సాగుకు పనికి రాకుండాపోయిన భూములకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులతో అంచనా వేయించి పరిహారం ప్రకటించాలన లేదంటే ప్రభుత్వమే సాగుకు లాకి అయ్యేవిధంగా భూములను తయారు చేసి ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. ఇండ్లు -నష్టపోయిన వారికి రూ. 30 వేల పరిహారం ఇవ్వడంతో పాటు పేదలకు రెండు నెలల పాటు నిత్యావసర వస్తువులను అందించాలని, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు భరించేవిధంగా చర్యలు తీసుకోవాలని సాంబశివరావు కోరారు. రూ.10వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర -వ్యాప్తంగా పలు చెరువులకు గండ్లు పడ్డాయని గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాగర్ కాలువకు -ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుభూతి మాటలకు పరిమితమై పరిహారం ప్రకటించకపోతే మరోసారి
-పడిన గండ్లను పూడ్చి వేయాలని గడిచిన మూడు రోజులుగా వాతావరణంలో మార్పు వచ్చిందని ఈ మార్పును సద్వినియోగం చేసుకుని గండ్లను పూడ్చి త్వరిత గతిన సాగునీటిని అందించేందుకు కాలువలకు నీటిని వదలాలని ఆయన కోరారు. పూర్తిగా నష్టపోయిన రైతులకు
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి పాలనను స్తంభింపజేస్తామని సాంబశివరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ -సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఎస్కి
జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, బిజి క్లెమెంట్, తాటి వెంకటేశ్వరరావు? సిహెచ్ సీతామహాలక్ష్మి, అజ్మీర రామ్మూర్తి, మిడికంటి వెంకటరెడ్డి, దండు ఆదినారాయణ, రావి శివరామకృష్ణ, మేకల శ్రీనివాసరావు, పగడాల
-మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, పలువురు మండల కార్యదర్శులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.