Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ!

  • సీఎంగా ప్రమాణం చేయిచిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
  • ప్రమాణ స్వీకారానికి హాజరైన కేజ్రీవాల్
  • కల్కాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అతిశీ

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు. గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం తెలిసిందే. కొన్ని నెలలు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ మీద విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అతిశీ సీఎంగా ప్రమాణం చేశారు.

అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఇంతకుముందు కేజ్రీవాల్ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిశీని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

కాగా, ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన అతి పిన్న వయస్కురాలిగా అతిశీ ఘనత అందుకున్నారు.

Related posts

అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్‌ అధికారి రవి

Ram Narayana

రాజకీయ ప్రత్యర్థులను ఒకటిగా చేసిన ధర్మశాల వరల్డ్ కప్ మ్యాచ్..!

Ram Narayana

ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. 

Drukpadam

Leave a Comment