Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వ్యాక్సినా ?ఎన్నికలా ? ఏదిముఖ్యం ?

వ్యాక్సినా ?ఎన్నికలా ? ఏదిముఖ్యం ?
ఏపీలో వ్యాక్సినా ? ఎన్నికలా ? ఏదిముఖ్యం? ప్రజల ఆరోగ్యమా ? ఎన్నికలా? అనేది ఇప్పుడు కోర్ట్ ముందున్న సమస్య ….. గత పదినెలలుగా వాయిదా పడుతూ వస్తున్న స్థానికసంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి , రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ లో విజేత ఎవరు పరాజిత ఎవరు అనేదాని పైనే దృష్టి కేంద్రీకరించి బడింది .నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా తీసుకుంటున్న నిర్ణయాలు మొదటి నుంచి వివాదంగానే ఉన్నాయి . రాష్ట్రప్రభుత్వానికి ఆయనకు మధ్య జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకున్నది .

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయనకు కలిసి ఎన్నికల విషయంపై నచ్చ చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . ప్రభుత్వం ఎంత వద్దన్నా , వారి మాట వినకుండా తాను అనుకున్నది చేసేందుకే నిర్ణయించుకున్నారు . అందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు . ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి . . ఒకవేళ ఆయన రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది సరిగా లేదు అనుకుంటే వెంటనే కోర్ట్ ను ఆశ్రవించే ఆవకాశం ఉంది . కానీ అలాంటిది ఏమి చేయకుండా నేరుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు . దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భగ్గుమన్నారు . ఎన్నికల నిధులు భవిష్కరిస్తామన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం సహకరించకుండా ఎన్నికలు పెట్టటం ఎలా సాధ్యం అనే సందేహాలు కలుగుతున్నాయి . దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం రాబోతున్నదని జోస్యాలు చెబుతున్నారు . ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరవాత దాన్ని వాయిదా వేయటం సాధ్యం కాదని ఇలా అనే వారే గతంలో ఎన్నికలు సగం అయిపోయిన తరువాత ఇదే ఎన్నికల కమీషనర్ కోవిద్ పేరుతొ ఎవరికీ చెప్పాపెట్టకుండా ఎన్నికలు వాయిదా వేయటం పై నోరుమెదపలేదు . ప్రస్తుతం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది . ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ,అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయరాదని కూడా ఆదేశాలు జారీచేశారు. అంతే కాకుండా పది నెలల క్రితం తాము బదిలీ చేసిన అధికారులను వెంటనే బదిలీచేయాలని ఆదేశాలు జారీచేసింది . ఈ విషయాల పై చీఫ్ సెక్రటరీ కి లేఖ రాశారు . కావలిసిన సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు . దీనిపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం అంతా తర్జన భర్జనలు పడుతున్నది . ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఏమిచేయాలి అనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు కోరుతున్నారు .హైకోర్ట్ లో హౌస్ మోషన్ పీటీషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం , కోవిద్ వ్యాక్సిన్ కార్యక్రమం పై రాష్ట్ర అధికార యంత్రాగం చేపట్టిన కార్యాచరణ గురించి , కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనాలు గురించి వివరించనున్నారు . కేంద్రం అన్ని రాష్ట్రాలు ఏలాంటి కార్యక్రమాలు ఉన్న వాటిని పక్కన పెట్టి వ్యాక్సిన్ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది . దీంతో కోర్ట్ కూడా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిద్ నివారణ చర్యలపైనే ఫోకస్ పెట్టాలని అందువల్ల ఎన్నికల విషయం రాష్ట్ర ప్రభుత్వం , ఎన్నికల సంఘం కలిసి నిర్ణయిచాలని సూచించే ఆవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు . కోర్ట్ ఏలాంటి ఆదేశాలు జారీచేస్తుందో చూడాల్సిందే !!!

Related posts

నేను సైతం అంటూ అస్సాల్ట్ రైఫిల్ అందుకున్న మాజీ మిస్ ఉక్రెయిన్

Drukpadam

2013లో మోదీ లక్ష్యంగా బాంబు దాడుల కేసు.. 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు!

Drukpadam

ఒక్క‌ తీర్మానమూ లేదు.. ర‌ష్యా, ఉక్రెయిన్ చ‌ర్చ‌లు విఫలం!

Drukpadam

Leave a Comment