Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డాక్టర్లపై దాడులకు నిరసనగా 18న దేశవ్యాప్త ఆందోళనకు: ఐఎంఏ…

డాక్టర్లపై దాడులకు నిరసనగా 18న దేశవ్యాప్త ఆందోళనకు: ఐఎంఏ…

-వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండించిన ఐఎంఏ
-‘సేవ్ ది సేవియర్స్’ పేరుతో 18న దేశవ్యాప్త ఆందోళన
-నల్ల వస్త్రాలు, బ్యాడ్జీలు, మాస్కులు ధరించి నిరసన
-డాక్టర్లపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాల్సిందే

వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 18న ఆందోళన నిర్వహించనున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. ‘సేవ్ ది సేవియర్స్’ పేరుతో చేపట్టనున్న ఈ ఆందోళనలో నల్లవస్త్రాలు, బ్యాడ్జీలు, మాస్కులు ధరించి నిరసన తెలపాలని రాష్ట్రంలోని ఐఎంఏ కార్యాలయాలకు పిలుపునిచ్చింది.

అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వైద్యులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఐఎంఏ.. వైద్యులపై దాడి చేసిన నిందితులపై ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలతోపాటు సెంట్రల్ హాస్పిటల్ హెల్త్‌కేర్ ప్రొఫెనల్స్ ప్రొటెక్షన్ చట్టాన్ని ప్రయోగించాలని డిమాండ్ చేసింది. అలాగే, ప్రతి ఆసుపత్రిలోనూ భద్రత పెంచాలని కోరింది. తమ డిమాండ్లు ఏమిటో చెబుతూ ఎల్లుండి దేశవ్యాప్తంగా విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నట్టు ఐఎంఏ పేర్కొంది. ఐ ఎం ఏ పిలుపుకు స్పందించిన దేశవ్యాపితంగా ఉన్న శాఖలు ఆందోళనకు సిద్ధపడుతున్నాయి.

Related posts

Drukpadam

ఈ అభాగ్యులంతా ఎవరో? ఇప్పటికీ గుర్తించలేని 101 మంది మృతదేహాలు!

Drukpadam

అజ్మీర్ లోని అనాసాగర్ సరస్సులో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు..

Drukpadam

Leave a Comment