Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పల్లెల ప్రగతి ,పట్టాన ప్రగతిపై కేసీఆర్ సమీక్ష;తాను ఒక జిల్లా దత్తత

పల్లెల ప్రగతి ,పట్టాన ప్రగతిపై కేసీఆర్ సమీక్ష;తాను ఒక జిల్లా దత్తత
-అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష
-పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యాచరణపై దిశానిర్దేశం
-అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపు
-అందరి భాగస్వామ్యం అవసరమని ఆకాంక్ష

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అభివృద్ధి, అంశాల వారీగా చేరుకున్న లక్ష్యాలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లెలు, పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని అన్నారు. పల్లెల ప్రగతి ,పట్టణ ప్రగతి పై కేసీఆర్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదనే అభిప్రాయంతోనే ఉన్నట్లు సమాచారం. అయితే కరోనా మహమ్మారి అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.జిల్లా అధికార కూడా పల్లె ప్రగతి,పట్టణ ప్రగతిపై ద్రుష్టి సారించాలని అన్నారు….పల్లెలు, పట్టణాలు ప్రగతి సాధించినప్పుడే రాష్త్రం ప్రగతి సాదిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు ….

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు 100 శాతం ప్రగతి పథంలో పయనించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని ఆకాంక్షించారు. ఈ క్రమంలో తాను కూడా ఓ జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యాచరణలో ప్రత్యక్షంగా పాల్గొంటానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించే క్రమంలో తక్షణమే కొన్ని నిధులను కేటాయించడానికి జిల్లా అదనపు కలెక్టర్లకు రూ.25 లక్షల వరకు అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

కాగా, సీఎం ఆదేశాలతో వెంటనే స్పందించిన ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ సమావేశం ముగిసేలోపు సంబంధిత జీవో ప్రతులను అదనపు కలెక్టర్లకు అందించడం విశేషం.

Related posts

గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

Drukpadam

Why Bold Socks Are The ‘Gateway Drug’ To Better Men’s Fashion

Drukpadam

తొమ్మిదేళ్లుగా తమ కుమార్తెకు పేరుపెట్టని దంపతులు… వారి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్

Drukpadam

Leave a Comment