ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు…ఏర్పాట్లను పరిశీలించిన జమ్మూ ,సిన్హా
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ లో నవంబర్ 14 ,15 న సమావేశాలు
హాజరు కానున్న జాతీయ కార్యవర్గ సభ్యులు ఆహ్వానితులు
ముందుగానే అక్కడకు చేరుకోనున్న ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి
దేశంలోనే జర్నలిస్టు ఉద్యమంలో అతి పెద్ద సంఘంగా ఉన్న ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ లో నవంబర్ 14,15 తేదీలలో జరగనున్నాయి .. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక అయిన హోటల్ పియర్స్ ఎవెన్యూ ను ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ , ఐజేయూ మాజీ అధ్యక్షులు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్ ఎన్ సిన్హాలు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు … అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఉత్తరాఖండ్ నేతలతో కలసి చర్చించారు . ఏర్పాట్లు బేషుగ్గా చేస్తున్నందుకు రాష్ట్ర నాయకులను ప్రశంసించారు . దేశంలోని 25 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులు , ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు …దేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈసమావేశంలో చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారు …ప్రధానంగా మీడియా రంగం ఎదుర్కుంటున్న సవాళ్లు ,పాలకవర్గాలు వైఖరిపై సమావేశం ద్రుష్టి సారించనున్నది … జర్నలిస్టులపై నిత్యం జరుగుతున్న దాడులు , మీడియా కమిషన్ ఏర్పాటు , వేతన చట్టం ఏర్పాటు పై తీర్మానించనున్నారు …