Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పార్టీ మారుతున్నారనే వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందన…

  • కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయన్న అనిల్
  • జగన్ ను వదిలే ప్రసక్తే లేదని వ్యాఖ్య
  • వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా

ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, రేటింగ్ లు పెంచుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. మరో పార్టీలోకి వెళ్లనని చెప్పారు. త్వరలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. 

తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని అనిల్ మండిపడ్డారు. దీని కోసం నారా లోకేశ్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఎందరో గొప్పవాళ్లు జైలుకు వెళ్లారని… తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Related posts

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని

Ram Narayana

తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని వ్యక్తి చంద్రబాబు…వయస్సుకు తగినట్లుగా మాట్లాడాలి: పేర్ని నాని…

Ram Narayana

ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ…!

Ram Narayana

Leave a Comment