Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్లమెంటరీ పిఎసి సమావేశంలో కరోనా సెకండ్ వేవ్ పై వాడివేడి చర్చ!

పార్లమెంటరీ పిఎసి సమావేశంలో కరోనా సెకండ్ వేవ్ పై వాడివేడి చర్చ
-నేను తప్పు మాట్లాడితే పీఏసీ ఛైర్మన్‌గా తప్పుకుంటా చైర్మన్ అధిర్‌ రంజన్‌ చౌధురి
-అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్డీఏ సభ్యులు
-శివసేన సైతం అభ్యంతరం
-కరోనా రెండో ఉద్ధృతి ప్రారంభం తర్వాత తొలి పీఏసీ సమావేశం
ఎజెండాకు విరుద్ధంగా కరోనాపై అధిర్‌ చర్చ
-అభ్యంతరం వ్యక్తం ఎన్‌డీఏ సభ్యులు
-సభ్యుల వాగ్వాదంతో చర్చ రసాభాస

పార్లమెంటరీ పీఏసీ సమావేశం రసాభాసగా నడిచింది. కాంగ్రెస్ లో లోకసభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పీఏసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే మెజార్టీ సభ్యులు పాలక పక్షమైన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కి చెందినవారే … దీంతో చైర్మన్ అధిర్ రంజన్ కోవిద్ సెకండ్ వేవ్ గురించి సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై ఎన్డీయే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి మహారాష్ట్రలో మిత్రులుగా ఉన్న సేవసేన మడ్డగు కూడా అధిర్ రంజన్ కు లభించలేదు. …వివరాల్లోకి వెళ్ళితే …..
లోక్‌సభలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌధురి అధ్యక్షతన నేడు పార్లమెంటరీ ప్రజా పద్దుల సంఘం భేటీ అయ్యింది. రెండో దశ కరోనా ఉద్ధృతి ప్రారంభమైన తర్వాత ఓ స్థాయి సంఘం భేటీ కావడం ఇదే తొలిసారి. తదుపరి సమావేశాలకు ఏజెండా నిర్ణయించడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. కానీ, అనూహ్యంగా అధిర్‌ రంజన్‌ కొవిడ్‌పై చర్చను ప్రారంభించడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యులైన జగదాంబిక పాల్‌, లలన్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం రసాభాసగా సాగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అధిర్‌ రంజన్‌ తీరుపై శివసేన వంటి ప్రతిపక్ష పార్టీలు సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పీఏసీ రికార్డుల ప్రకారం.. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ పరిధిలో ఉండే అంశాలను మాత్రమే చర్చించాలని అధిర్‌ రంజన్‌ పలువురు సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. అధిర్‌ రంజన్‌ పట్టువీడకపోవడంతో సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. తాను వాస్తవాలు మాత్రమే కమిటీ ముందుకు తీసుకొస్తున్నానని.. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే కమిటీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ సభ్యుడు తెలిపారు.

చివరకు ఇరు వర్గాలు శాంతించడంతో చర్చ ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. అనంతరం తదుపరి సమావేశాలకు సంబంధించిన ఎజెండాను చర్చించినట్లు తెలిపారు.

Related posts

అంబేద్కర్ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు: మంద కృష్ణ మాదిగ ఫైర్

Drukpadam

షర్మిలకు అడుగడుగునా జననీరాజం…

Drukpadam

రఘురామరాజును అనర్హుడిగా ప్రకటించండి వైసీపీ…

Drukpadam

Leave a Comment