Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి: డీకే శివకుమార్

  • మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందన్న డీకే
  • చన్నపట్నం ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ దే గెలుపని ధీమా
  • జార్ఖండ్ గురించి చెప్పలేనని వ్యాఖ్య

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. 

తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. మహారాష్ట్రలో తాను ప్రచారాన్ని నిర్వహించానని… తప్పకుండా గెలుస్తామనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు అంతా అనుకూలంగా ఉందనే విషయాన్ని తాను చూశానని చెప్పారు. 

ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల గురించి మాత్రం తనకు తెలియదని డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలోని చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు.

Related posts

గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. వాస్తవ ఫలితాలు ఇవీ

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవిగో… కాంగ్రెస్ పార్టీకే మొగ్గు!

Ram Narayana

ఏపీ లో జగన్ కు 50 శాతం …ఎన్డీయే కూటమికి 46 శాతం …పార్థదాస్ చాణక్యయ సర్వే

Ram Narayana

Leave a Comment