Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైయస్ షర్మిలకు చేదు అనుభవం …

వైయస్ షర్మిలకు చేదు అనుభవం
నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెల్లిని షర్మిల
ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన ఘటన
కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం
మా పరామర్శకు భయపడే లేకుండా చేశారు -ఇది మా తొలి విజయం మన్న షర్మిల
ఉద్యోగం పేరుతో బాధిత కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపణ

వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైయస్ షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది . ఒక నిరుద్యోగి తనకు ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . విషయం తెలుసుకున్న షర్మిల సూర్యాపేట జిల్లా లోని నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామానికి వెళ్ళింది . తీరా అక్కడకు చేరుకునే సరికి ఆయుకుడితో సహా కుటుంబసభ్యులు అందరు ఇంటికి తాళం వేసుకుని లేకుండా పోయారు . దీంతో ఆగ్రహం చెందిన ఆమె కేసీఆర్ సర్కారుపై మరోసారి విమర్శలు గుప్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి ….

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామానికి చెందిన యువకుడు నీలకంఠం సాయి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణలో ఉద్యోగ నోటిషికేషన్ల విడుదల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిల ఆ విషయం తెలిసి పరామర్శించేందుకు నిన్న వెళ్లారు.

అయితే, యువకుడి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను కలవ వద్దని టీఆర్ఎస్ నేతలు బాధిత యువకుడి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపించారు. ఇది తమ తొలి విజయమని షర్మిల అభివర్ణించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చింతలపాడు మండలంలోని దొండపాడు వెళ్లి ఇటీవల కరోనాతో మృతి చెందిన వైసీపీ నేత, ఏపీ బేవరేజెస్ కోఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.

Related posts

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్​’ సెక్యూరిటీ!

Drukpadam

వంగవీటి రాధా రాజకీయ అడుగులు ఎటువైపు …?

Ram Narayana

విజ‌య‌సాయిరెడ్డికి కౌంట‌ర్ ఇచ్చిన మాణిక్కం ఠాగూర్‌!

Drukpadam

Leave a Comment