Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నీటి పంపకాల విషయంలో ఆంధ్రా ,తెలంగాణ మధ్య యుద్ధమే !

నీటి పంపకాల విషయంలో ఆంధ్రా ,తెలంగాణ మధ్య యుద్ధమే !
తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం.. ఏపీతో తాడోపేడో తేల్చుకోవాలని కేబినెట్ నిర్ణయం
కేంద్రం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఏపీ బేఖాతరు చేస్తుందని విమర్శ
ఏపీ తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయం
ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రికి వినతిపత్రాలు
తెలంగాణ వాటా కోసం కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయం

నిన్నమొన్నటి వరకు ఉప్పు,పప్పులాగా ఉన్న ఏపీ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉప్పు నిప్పుల తయారైంది పరిస్థితి …… కృష జలాల వినియోగంపై ఇరురాష్ట్రాల కయ్యానికి కాలు దువ్వు తున్నాయి. ఫలితంగా నీటి యుద్ధం తప్పదా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది……ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , ఆంధ్రాగా విడిపోయినప్పటికీ అనేక అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. …. వాటిపై కలిసి కూర్చొని సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఇటు కేసీఆర్ , అటు జగన్ భావించారు….రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంపై ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు….కాని నీటి వాటాల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. …. కేంద్రం దగ్గర పరిష్కరించుకోవాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి….. ప్రత్యేకించి నీటి పారుదల ప్రాజెక్టు ల విషయంలో ఇరువురి మధ్య ప్రత్యన్న యుద్ధం నడుస్తుంది. … ఇప్పుడు అది బహిరంగ యుద్ధంగా మారనున్నది . శ్రీశైలం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాన్ని కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముముందుకు పోవడంపై తెలంగాణ కేబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పొరుగు రాష్ట్రంతో నీటి పంపకాల విషయంలో యుద్దానికి సిద్ధమైంది…….

రైతుల ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత నిన్న ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో సాగునీటి పారుదల రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ నిర్మిస్తున్న అనుమతి లేని ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించినా పట్టించుకోకపోవడాన్ని కేబినెట్ తీవ్రంగా పరిగణించింది. ఏపీ తీరుపై న్యాయస్థానాల్లోను, ప్రజా క్షేత్రంలోను తేల్చుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు, పార్లమెంటు సమావేశాల్లోనూ దీనిపై ప్రస్తావించాలని, ఏపీ ప్రాజెక్టుల కారణంగా తెలంగాణలో జరగబోయే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించనుంది. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయించాలని కోరాలని నిర్ణయించింది. ఏపీ ప్రాజెక్టుల కారణంగా హైదరాబాద్‌కు తాగునీరుతోపాటు పలు జిల్లాలకు సాగునీరు విషయంలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడిన కేబినెట్.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా నిర్ధారణ కాకపోవడంపై కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది.

Related posts

కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ జెండా ఎగురుతుందా …?

Drukpadam

టీడీపీ చంద్రబాబుది కాదు …మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు ..!

Drukpadam

అవినాశ్ నేరస్థుడు కాదు.. తప్పించుకోవడమూ లేదు….సజ్జల

Drukpadam

Leave a Comment