Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆటో మొబైల్ రంగంలో పెనుమార్పులు -కేంద్రం కొత్త చట్టం

ఆటో మొబైల్ రంగంలో పెనుమార్పులు -కేంద్రం కొత్త చట్టం
-15 సంవత్సరాలు దాటిన వాహనాలు పాత ఇనప సామాన్లకే
-రోడ్ల మీదకు వస్తే భారీ జరిమానాలు
-కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం
ప్రపంచంలోనే ఆటో మొబైల్ రంగంలో పెద్ద మార్కెట్ గా ఉన్న భారత దేశంలో పెనుమార్పులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నది . ఇందుకు త్వరలో కొత్త చట్టం తేబోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పేర్కొన్నారు . దీనితో కేంద్రం ఈ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం . అన్ని రాష్ట్రాలను ఇందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది . ఇటీవల కాలంలో మనదేశంలో వాహనాల వినియోగం పెరిగింది . కానీ రోడ్లు మాత్రం చాల తక్కువగా ఉన్నాయి . రోడ్ రవాణానే మనకు ప్రధానమైంది . దేశంలో పెరుగు తున్న వాహనాలకు తగ్గట్లుగా సౌకర్యాలు పెంచవలసిన అవసరం ఉంది . వాహనాలతో పాటు కాలుష్యం కూడా పెరగటం ఆదోళన కలిగిస్తున్న అంశం .ఇందుకు పెరుగుతున్న వాహనాలు కారణం అవుతున్నాయి . వీటిని నియంత్రించేందుకు కేంద్రం చట్టం తప్ప మరో మార్గం లేదు . అందువల్ల 15 సంవత్సరాల కాలం తీరిన వాహనాలను పాత సామాన్లకే తరలించాలని చట్టంలో పొందుపరచనున్నారు . ఇప్పటివరకు 15 సంవత్సరాల పైబడిన వాహనాలు సైతం తిప్పుకునేందుకు ఆవకాశం ఉంది . కొత్త చట్ట ప్రకారం ఆలాంటి ఆవకాశం ఉండదు . వాటిని చెత్తకుప్పలోకి తరలించాల్సిందే . ఇప్పటికే కొన్ని దేశాలు దీన్ని అమలు చేస్తున్నాయి . మన దేశంలో ఆటో మొబైల్ రంగంలో పెట్టుబడుల విలువ 4 .5 లక్షల కోట్లు , వీటిలో ఎగుమతులు 1 .5 లక్షల కోట్లు ఉన్నాయి . ఇక నుంచి పాత వాహనాల రోడ్ల మీద కాపాడితే అంతేసంగతులు . అందువల్ల ఇండియన్ ఆటో మొబైల్ రంగం మరింత అభివృద్ధి చెందే ఆవకాశం ఉంది . సామాన్యులకు ఇది మరింత భారం అవుతందనే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి . రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఈ చట్టం తెచ్చే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది .అయితే వాహనాల రేట్లు తగ్గించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా చట్టం లో చర్యలు లేకపొతే ఇబ్బందులు తప్పవు .

Related posts

మేరియుపోల్ ను వశం చేసుకున్న రష్యా… సైన్యాన్ని అభినందించిన పుతిన్!

Drukpadam

ఏపీలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాలు.. వాటి రాజధానులు ఇవే..!

Drukpadam

మీకు పదోన్నతులు కల్పిస్తున్న సీఎంను ఆ విధంగా మాట్లాడతారా?: ఉపాధ్యాయులపై సజ్జల అసంతృప్తి!

Drukpadam

Leave a Comment