Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మరియమ్మది ముమ్మటికి రాష్ట్రప్రభుత్వ హత్యే :సీఎల్పీ నేత భట్టి

మరియమ్మది ముమ్మటికి రాష్ట్రప్రభుత్వ హత్యే :సీఎల్పీ నేత భట్టి
పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టి చిత్రహింసలకు గురి చేశారు.
దీనిపై మానహక్కుల సంఘానికి వెళ్ళతాము
న్యాయ పోరాటం చేస్తాం
ఒక పేద దళిత మహిళను దుర్మార్గంగా చంపుతారా ?
చంపే అధికారం ఎవరు ఇచ్చారు ?
కేసీఆర్ పరభుత్వంలో జరుగుతున్న దుర్మార్గాలకు పరాకాష్ట

ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన మరియమ్మ అనే మహిళను పోలీసులు చిత్ర హింసలకు గురిచేసి దారుణంగా కొట్టి హత్య చేసి లాక్ ఆఫ్ డెత్ గా చిత్రీకరించడాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు . కనీసం చింతకాని పోలీసులకు తెలియకుండానే అడ్డ గూడూరు పోలీసులు వచ్చి మరియమ్మని తీసుకోని పోవడాన్ని భట్టి గర్హించారు . రాష్ట్రంలో జరుగుతున్నా పరిమాణాలకు మరియమ్మ హత్య అద్దం పడుతుందని అన్నారు. కనీసం మానవత్వం లేకుండా గ్రామంలోకి వచ్చి మరియమ్మ అనే మహిళను రాత్రిపూట అరెస్ట్ చేసి.. అర్ధరాత్రి వరకూ కొట్టి హింసించడం అత్యంత అమానుషం.. రాక్షసత్వం.. అని రాష్ట్ర పోలిసుల తీరుపై ధ్వజమెత్తారు . పోలీసులు కేవలం కేసీఆర్ మెప్పు పొందేందుకే ఉద్యోగాలు చేస్తున్నట్లు ఉందని మండి పడ్డారు .
మా అమ్మను కొట్టవద్దు అని ఆమె కుమార్తె కాళ్ళు పట్టుకున్నా.. ఆమె జుట్టు పట్టుకుని బిడ్డ ముందే లాఠీలు విరిగ కొట్టడం అమానుషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా దేశద్రోహులను, టెర్రస్టులను కూడా ఇంతా దారుణంగా హింసించరని అన్నారు . స్థానిక పోలీస్ స్టేషన్ లో కొట్టడమే కాక అడ్డగూడూరు స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడ కూడా అత్యంత పాశవికంగా పోలీసులు కొట్టి హింసించి చంపారని ఆరోపించారు . పోలీసులు ప్రజలను రక్షించడానికి ఉన్నారు కానీ ఇలా హింసించి, ప్రజలపై దౌర్జన్యం చేసి చంపేందుకు కాదని గుర్తుంచు కోవాలని అన్నారు .

పోలీసులు ఇలా ప్రవర్తించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరే కారణమని దుయ్యబట్టారు .. తనను తాను కాపాడుకోవడానికి పోలీసులకు ఇచ్చిన విచ్చలవిడి అధికారులు, విసృంఖలంగా వాళ్లు చేసే కార్యక్రమాలు పట్టించుకొక పోవడమే కారణమని ఆరోపణలు చేశారు .

దళిత మహిళ మరియమ్మను హింసించి లాకప్ డెత్ చేసి మూడు రోజులు అవుతోంది. ఇటువంటి లాకప్ డెత్ ను బయటకు రాకుండా కాపడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరిపైన, వాస్తవాలు బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేసిన వారిపైనా, పోలీస్ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్ చేశారు .

మరియమ్మ ఇంటి వద్దనుంచే జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన భట్టి .. జరిగిన సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం భాద్యులైన అందరిపైన, సంఘటన బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేసినా వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

గతంలో మంథని, సిరిసిల్ల ఘటనల్లో దోషులపై చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇప్పుడు పోలీసులు అతిగా ప్రవర్తించి మరియమ్మను కూడా చంపారని భట్టి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు . రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రికి ఏమాత్రం దయ, కరుణ ఉంటే వెంటనే ఈ ఘటనపై స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు .

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సినవి వెంటనే అందించాలన్నారు . చట్టం ప్రకారం రావాల్సిన ఉద్యోగం భూమి కూడా ఆ కుటుంబానికి వెంటనే ఇవ్వాలన్నారు .

సంఘటన జరిగిన వెంటనే అడ్డగూడూరు స్టేషన్ కు వెళ్లి బాధితుల తరపున పోరాటం చేసిన రాష్ట్ర ఎస్సీ కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర, కేంద్ర కమిషన్లకు, మానవ హక్కుల కమిషన్ కు ఎస్సీ డిపార్ట్ మెంట్ ద్వారా లేఖలు రాస్తాం ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులను భట్టి హోదార్చారు ……

Related posts

 ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఆడి కారును సీజ్ చేసిన పోలీసులు

Ram Narayana

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం…

Drukpadam

చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్!

Drukpadam

Leave a Comment