Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మరో సారి భారత్ పై ఓలి అక్కసు

యోగ పుట్టినప్పుడు భారత్ అనే దేశమే లేదా ? నేపాల్ ప్రధాని పై మండి పడుతున్న భారత్
అప్పుడు భారత్ అనే దేశమే లేదు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు
యోగా నేపాల్‌లోనే పుట్టిందన్న కేపీ శర్మ ఓలి
తమ ఋషుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పలేకపోయామని ఆవేదన
విషయంలో మోదీ సఫలమయ్యారన్న నేపాల్ ప్రధాని
రామ జన్మభూమి విషయంలో కుడి ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన ఓలి

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భారత్ పై విషం గక్కటం అలవాటుగా పెట్టుకున్నారు . యోగ పుట్టినప్పుడు భారత్ అనే దేశమే లేదన్నారు. యోగ జన్మస్థలం నేపాల్ నే అని అన్నారు. పైగా యోగాను నేపాల్ ఋషులు కనుగొన్నారని కానీ తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం లో విఫలమైయ్యారని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత ప్రధాని మోడీ సఫలమైయ్యారని అన్నారు. ఐక్య రాజ్యసమితిలో జూన్ 21 ని ప్రపంచవ్యాపితంగా యోగ డే గా గుర్తించాలని భారత ప్రధాని మోడీ ప్రతిపాదించగా అందరు ఆమోదించారని , దీంతో క్రిడెట్ అంట భారత్ కె దక్కిందని అన్నారు.

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన అధికారిక నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఓలి మాట్లాడుతూ.. యోగా నేపాల్‌లోనే పుట్టిందన్నారు. నిజానికి ఈ ప్రపంచానికి యోగా పరిచయం అయినప్పుడు భారత్ అనే దేశమే లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగాను తమ ఋషులే కనుగొన్నారని, అయితే వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ సఫలమయ్యారని అన్నారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో మోదీ ప్రతిపాదించడంతో దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. కాగా, నేపాల్ ప్రధానికి వివాదేలేమీ కొత్త కాదు. గతంలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Related posts

కాంగ్రెస్‌కు మరో షాక్.. త్రిపురలో పార్టీ అధ్యక్షుడు రాజీనామా!

Drukpadam

ఎంపీ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో భారీ ర్యాలీ..

Drukpadam

రాజ్య‌స‌భ‌కు ‘బాహుబ‌లి’ క‌థా ర‌చ‌యిత‌ విజయేంద్రప్రసాద్!

Drukpadam

Leave a Comment