Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాట్ కామెంట్స్!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ వేముల ప్రశాంత్ రెడ్డి    హాట్ కామెంట్స్!
-కృష్ణనదిపై ఆంధ్ర ప్రాజక్టు లు అక్రమం అని ధ్వజం
-రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు కడితే …జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం
-వైయస్ రాజశేఖర్ రెడ్డి దొంగ … జగన్ గజ దొంగ అంటూ ఫైర్
-వీటికి అడ్డుకట్ట వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
-అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు చేపడుతోందని ఆరోపణ
-తమ వాటా ప్రకారమే నీళ్లు వాడుకుంటామని ఏపీ వెల్లడి
-గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదంటున్న తెలంగాణ
ఎన్జీటీ స్టే ఇచ్చినా లెక్కచేయడంలేదని వెల్లడి
ఏపీని అడ్డుకోవాలని కృష్ణా బోర్డు కు విజ్ఞప్తి
బోర్డుకు తగిన ఆధారాలు సమర్పించిన తెలంగాణ సర్కారు

కృష్ణ నదిపై ప్రాజెక్టు ల నిర్మాణం విషయంలో అంధ్ర , తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది … కృష్ణ నదిపై ఆంధ్రా అక్రమంగా అనుమతులు లేకుండా ప్రాజక్టు లు నిర్మిస్తుందని తెలంగాణ ఆరోపిస్తుండగా , మీరే అక్రమ ప్రాజక్టు లు నిర్మించారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యారోపణ చేస్తుంది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి   ఒకడుగు ముందుకేసి , దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పైన ఆయన తనయుడు ,ప్రస్తుత అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పైన హాట్ కామెంట్స్ చేశారు. నీటిని దొంగిలించడంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే జగన్ మోహన్ రెడ్డి గజ దొంగ అంటూ ధ్వజమెత్తారు. లంకలో రాక్షసులు లేరనేది ఎంత నిజమో ఆంధ్రప్రదేశ్ లో దొంగలు లేరనేది అంతే నిజమని అన్నారు. కృష్ణానదిపై ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తే పాలమూరు జిల్లా ఎడారి కావడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా ఆంధ్రా పాలకుల నీటి చొర్యానికి అడ్డుకట్ట వేసి తెలంగాణ హక్కులను కాపాడాలని కేంద్రప్రభుత్వాన్ని ఆయన కోరారు.

రెండు రాష్ట్రాలు పంతాలకు. పట్టింపులకు పోవడంతో ఈ వివాదం ముదిరింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రమద్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందనే అందోళన వ్యక్తం అవుతుంది. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించినా లెక్కచేయకుండా, ఏపీ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని ఆరోపించింది. డీపీఆర్ కోసం ప్రాథమిక పనులు అంటూ ప్రాజెక్టు పనులు చేపడుతోందని వివరించింది.

ప్రాజెక్టు పనులకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి తప్పనిసరి అని కేంద్రం కూడా ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఏపీ ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాలను పరిరక్షించాలని కోరింది. తన ఆరోపణల మేరకు తెలంగాణ ప్రభుత్వం తగిన ఆధారాలను కూడా సమర్పించింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కు లేఖ రాశారు . బోర్డు నిర్లక్ష్యం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై నిబంధనలకు విరుద్ధంగా ప్రాజక్టులు కడుతుందని ,అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు .

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు…టీడీపీ గగ్గోలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు !

Drukpadam

కొత్త ముసుగులో చంద్రబాబు తెలంగాణలోకి వస్తున్నారు: హరీశ్ రావు…

Drukpadam

 ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులపై లెక్కలు చెప్పిన పురందేశ్వరి!

Ram Narayana

Leave a Comment