Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, కుమారుడిపైన చిత్రహింస లకు పాల్పడిన ఘటనపైన న్యాయ విచారణ జరపాలి…

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, కుమారుడిపైన చిత్రహింస లకు పాల్పడిన ఘటనపైన న్యాయ విచారణ జరపాలి
-బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
-అతికిరాతకంగా దాడికి, హత్యకు పాల్పడిన వారిపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యానేరం కేసులు తక్షణమే నమోదు చేయాలి
-కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్

ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన దళిత కుటుంబంపైన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు మోపబడి అంబడిపూడి మరియమ్మ అనే మహిళ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు గురైన ఘటన పైన ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపైన ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుతో పాటు హత్యానేరం కేసులను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అతికిరాతకంగా దాడికి గురైన బాధితుడైన ఉదయ్ కిరణ్ కు మెరుగైన వైద్యం అందించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుడైన ఉదయ్ కిరణ్ ను కెవిపిఎస్ జిల్లా బృందంతో వెళ్లి ఆయన పరామర్శించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రంలో అనునిత్యం దళితులపైన దాడులకు, హత్యలకు, వెలివేతలకు, అణిచివేతలకు గురి అవ్వడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ చట్టాన్ని కాపాడవల్సిన పోలీసులు, అధికారులే ఇలాంటి ఘటనలు పాల్పడటంతో దళితులపైన దాడులు, కుల దూరంహంకార హత్యలు రాష్ట్రంలో పెచ్చరిల్లిన అధికార పార్టీకి ఏమి పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారని వారు విమర్శించారు. ఏదైనా కేసు నిమిత్తం అనుమానితుల పైన పోలీసులు ఇంతటి క్రూరంగా వ్యవహరించడమే కాకుండా నేరాన్ని బలవంతంగా ఒప్పుకునే దాకా హింసించడం హేయమన్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి దుర్మార్గపు, పాశవిక ఆటవిక ఘటనలు జరగడం అత్యంత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. నాటి నుంచి నేటి వరకు లాకప్ డెత్ లు జరుగుతుండడం పైన సభ్యసమాజం పోలీసుల తీరుపైన ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే ప్రభుత్వం స్పందించి మరియమ్మ లాకప్ డెత్ కు పాల్పడిన, ఆమె కుమారుడైన ఉదయ్ మర్మాంగ అవయవాలపైన అతికిరాతకంగా దాడికి పాల్పడిన పోలీసులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, పోలీసుల ఒత్తిడిని అరికట్టి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ పట్టణ నాయకులు గద్దల వీరబాబు, గద్దల అనిల్, పి.సత్యనారాయణ, ఎన్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related posts

సూట్ కేసులో అమ్మాయి శవం… తండ్రే హంతకుడు!

Drukpadam

అప్పు చేసి, భూమి తాకట్టు పెట్టి మరీ ఏఈఈ పేపర్ కొనుగోలు!

Drukpadam

మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపులు.. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్!

Drukpadam

Leave a Comment