Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమ్మకానికి అమెరికా సిటిజన్ షిప్ …రూ.44 కోట్లిస్తే గోల్డ్ కార్డ్ కు రెడ్ కార్పెట్ … ట్రంప్

  • విదేశాల్లోని సంపన్నులకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆఫర్
  • విధివిధానాల రూపకల్పనలో అధికార యంత్రాంగం
  • పది లక్షల కార్డులు అమ్మాలని ట్రంప్ యోచన

అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న సంపన్నులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఆఫర్ ను తీసుకురాబోతున్నారు. సిటిజన్ షిప్ (పౌరసత్వం)ను అంగట్లో అమ్మకానికి పెట్టబోతున్నారు. 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.44 కోట్లు) చెల్లిస్తే ‘గోల్డ్ కార్డ్’ ద్వారా అమెరికాలో నివసించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. గ్రీన్ కార్డ్ ద్వారా పొందే అన్ని సౌకర్యాలను ఈ గోల్డ్ కార్డ్ తో పొందవచ్చని, దీంతో సిటిజన్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మొత్తంగా పది లక్షల గోల్డ్ కార్డ్ లను విక్రయించాలని ట్రంప్ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ త్వరలోనే ఈ గోల్డ్ కార్డ్ ను ట్రంప్ అంగట్లోకి తీసుకురావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇలా డబ్బులతో అమెరికా సిటిజన్ షిప్ కొనుక్కునే విధానం ఇప్పటికే అమలులో ఉందని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈబీ-5 పోగ్రాం కింద విదేశీయులు గ్రీన్ కార్డ్ పొందే వెసులుబాటు ఉందన్నారు. ఇందుకోసం అమెరికాలో 8 లక్షల డాలర్ల నుంచి 20 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా కనీసం పదిమంది అమెరికన్లకు శాశ్వత ఉద్యోగం లభించాలి. పెట్టుబడులను కనీసం రెండేళ్ల పాటు కదిలించకూడదనే షరతులు ఈబీ-5 పోగ్రాంలో ఉన్నాయి. ఈ నిబంధనలను పాటించిన వారికి ఈబీ-5 పోగ్రాం కింద అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ అందజేస్తుంది.

Related posts

రెప్పతో పాటు కంటిని సమూలంగా మార్చిన వైద్యులు

Ram Narayana

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు… అత్యంత కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు!

Ram Narayana

స్విట్జర్లాండ్ లో బుర్ఖా వేసుకుంటే ఫైన్

Ram Narayana

Leave a Comment