Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మా గవర్నర్‌ ఓ అవినీతిపరుడు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

మా గవర్నర్‌ ఓ అవినీతిపరుడు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
-1996 జైన్‌ హవాలా ఛార్జిషీట్‌లో ధన్‌ఖడ్‌ ను చేర్చారు
-ఇలాంటి వ్యక్తిని గవర్నర్‌ పదవిలో ఎలా కొనసాగిస్తారు
తొలగించాలని అనేకసార్లు లేఖ రాశా
-బెంగాల్‌ను విభజించేందుకు కుట్ర
-జగదీప్‌ ధన్‌ఖడ్‌ పై దీదీ తీవ్ర ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్ ధన్‌ఖడ్‌ మధ్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా దీదీ గవర్నర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనని అవినీతిపరుడిగా అభివర్ణించారు. ఇది రాజకీయవర్గాలలో పెను సంచలనంగా మారింది. అనేక సార్లు గవర్నర్ ముఖ్యమంత్రి మమతకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గవర్నర్ రాజ్యాంగ బద్ద ప్రతినిధిలా కాకుండా బీజేపీ ప్రతినిధిగా వ్యవరిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఒక పర్యటనలలో కేవలం ఆయన్ను బీజేపీ ప్రతినిధులు మాత్రమే కలిశారని విమర్శలు ఉన్నాయి.

‘‘ఆయన(జగదీప్‌ ధన్‌ఖడ్‌) అవినీతిపరుడు. 1996 జైన్‌ హవాలా కుంభకోణం ఛార్జిషీట్‌లో ఆయన పేరును చేర్చారు. అయితే, కోర్టు కెళ్లి దానిని క్లియర్ చేసుకున్నారు. అయినా ఈ విషయంపై ఓ పిల్ వుంది. అదింకా పెండింగులోనే వుంది. డైరీ ద్వారా ఏయే రాజకీయ నాయకుడికి ముడుపులు ముట్టాయో బయటపడింది. అయినా, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యక్తిని గవర్నర్‌ పదవిలో ఎలా కొనసాగిస్తోంది?’’ అని మమత ప్రశ్నించారు. భారీ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఎందుకు నియంత్రించాలని ప్రశ్నించారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు.

రాజ్యాంగం ప్రకారం.. తాను గవర్నర్‌ని కలుస్తానని, చర్చిస్తానని.. అన్ని సంప్రదాయాలను పాటిస్తానని తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం తన లేఖ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఉత్తర బెంగాల్‌లో గవర్నర్‌ పర్యటించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పైగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆయన కలిశారని ఆరోపించారు. బెంగాల్‌ను విభజించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

దీదీ వ్యాఖ్యలపై గవర్నర్‌ ధన్‌ఖడ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఇప్పటి వరకు ఏ అవినీతి కుంభకోణంలోనూ నిందితుడిని కాదన్నారు. ఓ రాజకీయ నాయకురాలి నుంచి ఇలాంటి ఆరోపణలను తాను ఊహించలేదన్నారు.

Related posts

పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభానికి సిద్ధూనే కారణం: అమరీందర్ భార్య ఆరోపణ!

Drukpadam

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ గా పోటీచేయనున్న జయప్రకాశ్ నారాయణ!

Drukpadam

అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటున్నాం: రేవంత్ రెడ్డి!

Drukpadam

Leave a Comment